"మాకిప్పుడు సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. సోమవారంతో అయిపోతాయి. ఆ తరువాత మీకు సినిమా చూపిస్తాం" ఇది తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీ జూనియర్లకు సీనియర్ల నుంచి వస్తున్న హెచ్చరిక. హాస్టళ్లలో తమ గదులకు జూనియర్లను పిలిపించుకుంటున్న సీనియర్లు తమ ఇష్టానుసారం ర్యాగింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. ర్యాగింగ్ జరగకుండా చూసేందుకు ఉన్నతాధికారులు చేసిన ఆదేశాలను వీరు పట్టించుకోవడం లేదని జూనియర్లు వాపోతున్నారు. ఎంసీఏ మొదటి సంవత్సరం విద్యార్థులకు 10వ తేదీ నుంచి క్లాసులు మొదలు కాగా, వీరికి డీ-బ్లాక్ లో వసతి కల్పించారు.
రోజూ రాత్రి 10 గంటల సమయంలో జూనియర్లను తమ గదులకు పిలిపించుకుని సీనియర్లు వారిని ర్యాగింగ్ చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చేతులు చాపి 2 గంటలకు పైగా నిలబెట్టడం, టేబుల్ కింద క్రికెట్ ఆడాలని, నేల మీద కప్పలా గెంతులేయాలని, నేలపైనే ఈతకొట్టి చూపాలని, ఇవన్నీ సోమవారం నుంచి చేయాల్సి వుంటుందని హెచ్చరించారట. ఎవరైనా ఫిర్యాదు చేస్తే, అన్ని సబ్జెక్టులూ ఫెయిల్ చేయిస్తామని భయపెట్టారట. దీంతో దిగాలు పడ్డ జూనియర్లు తమ టీసీలు ఇచ్చేస్తే వెళ్లిపోతామని మొరపెట్టుకుంటున్నారు.
More Telugu News
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!