'ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్' విధానం అమలు చేయాలంటూ మాజీ సైనికులు ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి బాటలోనే రైల్వే ఉద్యోగులు కూడా 'ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్' డిమాండ్ చేస్తున్నారు. తమను విస్మరింపజాలరని, రక్షణ రంగ సిబ్బంది లాగానే, తాము కూడా జాతికి తమ సేవలను అంకితం చేశామని అంటున్నారు. రైల్వే ఉద్యోగులకు ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్ అంశాన్ని ఏడో వేతన సంఘం కూడా చర్చించిందని, మరోసారి దీన్ని లేవనెత్తుతామని ఆలిండియా రైల్వే ఉద్యోగుల సమాఖ్య జనరల్ సెక్రటరీ శివ్ గోపాల్ మిశ్రా తెలిపారు.
రైల్వే ఉద్యోగులు అంకితభావంతో సేవలందిస్తున్నారని, రైల్వే శాఖ దేశానికి జీవనరేఖ వంటిదని పేర్కొన్నారు. రక్షణ దళాల సిబ్బందికి 'ఒకే ర్యాంకు...' విధానాన్ని అమలు చేసినట్టయితే, తమకు కూడా ఆ విధానాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ఏదైనా చెబుతారని ఆశించామని, కానీ, ఆయన ఏమీ చెప్పకుండా నిరాశపరిచారని మిశ్రా పేర్కొన్నారు.
More Telugu News
-
అద్దె కట్టట్లేదు, ఏమైందని చూస్తే.. గదిలో రూ. 85 లక్షల నకిలీ నోట్లు!
-
జగన్‌ను ఓడించి విశాఖను ప్రజలే కాపాడుకున్నారు: గంటా శ్రీనివాసరావు
-
మెదడు ఆరోగ్యాన్ని కళ్లు, చెవులు చెప్పేస్తాయి!
-
యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్.. దూసుకుపోతున్న 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్!
-
విశాఖకు 870 కి.మీ దూరంలో తీవ్ర వాయుగుండం.. ఐఎండీ అప్ డేట్
-
రాహుల్ విదేశీ పర్యటనలు దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే: రాహుల్ పై పీవీ మనవడు ఎన్వీ సుభాష్ విమర్శలు
-
'ఎక్స్'లో కొత్త ఫీచర్.. ఇక 'లైక్' బటన్‌తో డబ్బు పంపొచ్చు!
-
టీమిండియా చేతిలో వరుసగా రెండు ఓటములపై న్యూజిలాండ్ కోచ్ ఏమన్నాడంటే..!
-
ఎంతటి లక్ష్యమైనా భారత బలగాలను దాటిపోలేదు: ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్
-
దీని గురించి ఎందుకు మాట్లాడరు?.. విశాఖ గంగవరం బీచ్ పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్
-
ఏఈ లలిత కుమారి హత్య కేసు.. నేరుగా ఆమె భర్త వద్దకు వెళ్లిన పోలీసు జాగిలం!
-
ఇప్పుడు స్థానిక ఎన్నికల పేరుమీద జరుగుతున్నది గ్యాంగ్ వార్ మాత్రమే: విజయసాయిరెడ్డి
-
సైకిల్‌పై డెలివరీలు.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు ఊహించని కానుక.. వైరల్ అవుతున్న వీడియో!
-
డ్రంకెన్ డ్రైవ్‌లో హల్చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైరల్!
-
చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!