మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత విలాస్ రావు దేశ్ ముఖ్ విగ్రహాన్ని లాతూర్ లో శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మంత్రి పంకజా ముండే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవార్, ముండే సినీ తారల పేర్లతో ఒకరినొకరు అభినందించుకున్నారు. తొలుత పంకజా ముండే తన ప్రసంగంలో పవార్ గురించి మాట్లాడారు. సినిమాల్లో దిలీప్ కుమార్ ఎలాంటివారో, రాజకీయాల్లో శరద్ పవార్ అలాంటి వ్యక్తి అని పేర్కొన్నారు. పవార్ కు ఏమైనా బిరుదు తగిలించాల్సి వస్తే పొలిటికల్ దిలీప్ కుమార్ అని పిలవవచ్చని అన్నారు.
అనంతరం, పవార్ తన వంతు రాగానే, పంకజా ముండేను నేటి తరం అందాల తార దీపికా పదుకొనేతో పోల్చారు. పంకజా ముండే రాజకీయాల్లో దీపికా పదుకొనే వంటివారని అన్నారు. తాను పెద్దగా సినిమాలు చూడనని, అందుకే, ప్రస్తుతం సినీ ఫీల్డ్ లో ఎవరు పాప్యులరో నటుడు రితేశ్ దేశ్ ముఖ్ (విలాస్ రావు దేశ్ ముఖ్ తనయుడు) ను అడిగి తెలుసుకున్నానని వివరించారు. రితేశ్ ఇప్పుడు దీపికా పదుకొనేకు విశేష ప్రజాదరణ ఉందని చెప్పాడని, దాంతో, పంకజా ముండేను దీపికాతో పోల్చానని చెప్పుకొచ్చారు.
More Telugu News
-
పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక
-
టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు
-
తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి
-
మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!
-
డిసెంబర్లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ
-
మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి
-
ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్
-
కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్‌లు
-
అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్
-
తిరుమల అప్డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?
-
ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్
-
భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు
-
యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం
-
రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!
-
మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్