ప్రపంచవ్యాప్తంగా ఫ్యాక్టరీల్లో రోబోల వినియోగం క్రమంగా పెరుగుతోంది. అయితే, యాజమాన్యానికి సమయం, ధనం ఆదా చేసే ఆ రోబోలు కొన్నిసార్లు కార్మికుల ప్రాణాలను బలిగొంటున్నాయి. తాజాగా, గుర్గావ్ ప్రాంతంలోని నూతన పారిశ్రామికవాడ మనేసర్ లో ఓ కార్మికుడు రోబో కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఎస్కేహెచ్ మెటల్స్ కంపెనీలో రామ్‌జీ లాల్ (24) అనే వ్యక్తి లోడర్ గా పనిచేస్తున్నాడు. లాల్ వెల్డింగ్ యూనిట్ లో విధుల్లో ఉన్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ యూనిట్ లో 63 మంది వరకు కార్మికులు, 39 రోబోలు విధి నిర్వహణలో ఉన్నట్టు తెలిసింది.
కాగా, లాల్ ప్రాణాలు హరించిన రోబో పని మెటల్ షీట్లను పైకెత్తి వెల్డింగ్ చేయడమే. అయితే, ఓ షీట్ నిర్దేశిత స్థానం నుంచి పక్కకు జరగడంతో దాన్ని సరిచేసేందుకు లాల్ యత్నించాడు. ఆ క్రమంలో రోబోకు అటాచ్ చేసిన వెల్డింగ్ స్టిక్స్ లాల్ కడుపులో గుచ్చుకున్నాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. లాల్ విధుల్లో చేరి ఒకటిన్నర సంవత్సరం అయినట్టు తెలిసింది. అతడు యూపీలోని ఉన్నావో ప్రాంతానికి చెందినవాడు.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్