2011 నుంచి 13 వరకు ఎంతమందికి ఉరిశిక్షలు విధించారన్న వివరాలను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు లోక్ సభలో వెల్లడించింది. ఈ మూడేళ్లలో 339 మందికి ఉరిశిక్ష విధిస్తున్నట్టు తీర్పులు వెలువరించినట్టు ప్రశ్నోత్తరాల సమయంలో హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ పారతి భాయ్ చౌదరి తెలిపారు. జాతీయ నేరాల రికార్డు సంస్థ వివరాల ప్రకారం, 2011లో 117 మందికి ఉరిశిక్షలు పడ్డాయని, 2012లో 97 మందికి, 2013లో 125 మందికి ఉరిశిక్ష పడినట్టు ఆయన వివరించారు. ప్రస్తుత వివరాల ప్రకారం వీటిలో ఐదు కేసులకు సంబంధించి మాత్రం క్షమాభిక్ష పిటిషన్ లు ఉన్నాయన్నారు. అయితే 2011లో ఎవరినీ ఉరి తీయలేదని 2012లో ఒకరిని, 13లో మరొకరిని ఉరితీసినట్టు తెలిపారు.