ఏపీ అసెంబ్లీలో సాధారణ వ్యవహారాల కమిటీ ఈ రోజు భేటీ అయింది. పలు విషయాలతో పాటు వైఎస్ జగన్ ఇటీవల సీఎం, స్పీకర్ లకు రాసిన బహిరంగ లేఖపై కూడా చర్చించింది. అనంతరం టీడీపీ విప్ కాల్వ శ్రీనివాస్ మాట్లాడుతూ, అసెంబ్లీ కమిటీల పరిధిలోకి రాని వాటిపై చర్చించేందుకే జనరల్ పర్పసెస్ కమిటీ అని చెప్పారు. నిబంధనల ప్రకారమే కమిటీలో పార్టీలకు చోటు ఉంటుందన్నారు. 'జగన్ కు అనుభవం లేదు, నిబంధనలు తెలియదన్న' కాల్వ, అధికారులను ప్రశ్నించే హక్కు ఆయనకు లేదని స్పష్టం చేశారు.
కాగా అసెంబ్లీ లాంజ్ లో మాజీ స్పీకర్ల ఫోటోలు పెట్టడం సంప్రదాయమన్నారు. ఒకవేళ సీఎంల ఫోటోలు పెట్టాలనుకుంటే తెలుగు జాతి పేరును ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్ ఫోటో సహా అందరి సీఎంల ఫోటోలు పెట్టాలని స్పీకర్ కు చెప్పామన్నారు. అయినా రాష్ట్రానికి వైఎస్ చేసిన మేలు ఏమీ లేదనేది తమ అభిప్రాయమని పేర్కొన్నారు. వైఎస్ చిత్రపటంపై వైసీపీ రాద్దాంతం చేస్తోందని, స్పీకర్ కు లేఖ రాసి విమర్శలు చేయడం సరికాదని సూచించారు.
More Telugu News
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!