తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదు నగరంలో ఏటేటా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా రాత్రి 9 గంటల తరువాత యముడు తరుముకొస్తున్నాడు. ప్రమాదాలకు నిలయంగా మారిన గ్రేటర్ హైదరాబాదులో నిత్యమూ పాదచారులు రహదారి ప్రమాదాల్లో మృతి చెందుతున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తన తాజా నివేదికలో వెల్లడించింది. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం, 2013తో పోలిస్తే, 2014లో ప్రమాదాల సంఖ్య 2,439 నుంచి 2,908కి పెరిగింది.
ఇతర నగరాలతో పోలిస్తే ప్రమాదాల సంఖ్య హైదరాబాదులో తక్కువే అయినప్పటికీ, సంవత్సరం వ్యవధిలో దాదాపు 20 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కాగా, చెన్నైలో అత్యధికంగా 9,465 ప్రమాదాలు జరుగగా, ఢిల్లీలో 7,191, బెంగళూరులో 5,215, భోపాల్ లో 4,087 ప్రమాదాలు జరిగాయి. రాత్రి 9 గంటల తరువాత ర్యాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ ఉల్లంఘనలే యాక్సిడెంట్లకు ప్రధాన కారణమని ఎన్సీఆర్బీ వివరించింది. పాదచారులు రోడ్లను దాటుతున్నప్పుడు ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపింది. ఇక నెలల వారీగా ప్రమాదాలు పరిశీలిస్తే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే డిసెంబర్ ప్రమాదాల విషయంలో ముందు నిలిచింది. డిసెంబర్ నెలలో 515 ప్రమాదాలు జరుగగా, అక్టోబర్ లో 235 ప్రమాదాలు జరిగాయి. 30 నుంచి 45 సంవత్సరాల వయసున్న వారు యాక్సిడెంట్లలో అత్యధికంగా మరణిస్తున్నారని ప్రకటించింది.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్