తన తండ్రి చేతిలో అధికారం ఉందన్న అహంభావంతో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగినిని కిడ్నాప్ చేయబోయి కటకటాలు లెక్కిస్తున్నాడో యువకుడు. ఈ ఘటన హైదరాబాద్ నడిబొడ్డున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కర్నూలు జిల్లా సీఐడీ విభాగానికి చెందిన అదనపు ఎస్పీ శ్రీధర్ కుమారుడు శ్రీకాంత్ (26), తన స్నేహితులు వెంకటేష్, అరుణ్ లతో కలసి పూటుగా మద్యం సేవించాడు. 'పోలీస్' అని రాసున్న కారులో చక్కర్లు కొట్టడం ప్రారంభించారు.
ఇదే సమయంలో వనస్థలిపురం ప్రాంతానికి చెందిన ఓ వివాహిత (28) అమీర్ పేటలోని ఓ కంపెనీలో విధులు ముగించుకుని, ఇంటికి వెళుతూ, మార్గమధ్యంలో స్నేహితురాలి కోసం దిల్ సుఖ్ నగర్ దగ్గర ఆగింది. ఆమెను చూసిన శ్రీకాంత్, తన మిత్రబృందంతో కలసి వేధిస్తూ, అసభ్యంగా ప్రవర్తించాడు. బలవంతంగా కారులోకి తోసి కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్పందించి అడ్డుకోబోయిన యువకుడిని చితకబాదారు. ఘటనను చూస్తున్న మరికొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చేలోగా, అరుణ్ పరారయ్యాడు. శ్రీకాంత్, వెంకటేష్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్