మేక పాలిస్తుంది కానీ, మేకపోతు పాలివ్వడమేంటని ఆశ్చర్యపోతున్నారా? పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాల జ్ఞానం గుర్తొస్తోందా? నిజమేనట, మేకపోతు పాలిస్తోందని దాని యజమాని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ఇటవా జిల్లాలోని అధ్యాపూర్ గ్రామంలో ఉదాల్ సింగ్ అనే వ్యక్తి ఈ మధ్యనే ఓ మేకపోతును కొనుగోలు చేశారు. ఆయన కొనుగోలు చేసిన అనంతరం దాని శరీరాకృతిలో మార్పులు రావడం గమనించినట్టు ఉదాల్ సింగ్ తెలిపారు. తరువాత ఓ రోజు ఓ మేకపిల్ల ఒకటి ఈ మేకపోతు పొదుగు నుంచి పాలుతాగుతూ కనిపించిందని, నిజమోకాదో పరీక్షించేందుకు తాము కూడా పాలు పితికామని ఆయన చెప్పారు.
ఆశ్చర్యకరంగా దాని పొదుగు నుంచి పాలు వస్తున్నాయని, పాలో కాదో అనే అనుమానంతో పశువుల ఆసుపత్రి వైద్యుడికి చూపితే, హార్మోన్లలో వచ్చిన మార్పుల కారణంగా ఇలా అరుదుగా జరుగుతుందని చెప్పారని ఆయన వెల్లడించారు. దీంతో మేకపోతు సెలబ్రిటీగా మారిపోయిందని, దీనితో ఫోటో దిగేందుకు చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారని, దీని తలను తాకితే అదృష్టం వరిస్తుందన్న నమ్మకంతో తలను తాకి వెళ్తున్నారని ఉదాల్ సింగ్ చెప్పారు.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్