జీవించి ఉన్న ఆంత్రాక్స్ బ్యాక్టీరియాను 9 రాష్ట్రాలకు పంపి అమెరికా సైన్యం పెద్ద పొరపాటే చేసింది. కాస్త అజాగ్రత్తగా ఉండి దాన్ని బయటకు తీసుంటే, ప్రజల ప్రాణాలకు పెను విఘాతమే కలిగివుండేది. అయితే అదృష్టవశాత్తూ అలా జరగలేదు. పొరపాటును గ్రహించి నాలుక్కరుచుకున్న అధికారులు ఆ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. బ్యాక్టీరియా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఈ విషయాన్ని పెంటగాన్ అధికారులు స్పష్టం చేశారు. బ్యాక్టీరియాను పరీక్షించే నిమిత్తం దాన్ని క్రియారహితంగా మార్చకుండానే, సౌత్ కొరియాలోని అమెరికా ఎయిర్ బేస్ సహా తొమ్మిది రాష్ట్రాల్లోని ల్యాబొరేటరీలకు పంపిందని ఓ అధికారి తెలిపారు. ఈ ఘటన గత సంవత్సరం జరిగిందని, దీనివల్ల ప్రజలకు ఎటువంటి ప్రమాదమూ లేదని ఆయన అన్నారు.
నలుగురు అమెరికన్ పౌరులకు మాత్రం ముందు జాగ్రత్త చర్యగా ఆంత్రాక్స్ నిరోధక యాంటీ బయాటిక్స్ ఇస్తున్నామని, వీరి ప్రాణాలకూ ప్రమాదం లేదని మొత్తం ఘటనపై విచారణ జరుపుతున్న యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ విభాగం అధికారి జాసన్ మెక్ డొనాల్డ్ వివరించారు. గాల్లో కలిసిన ఆంత్రాక్స్ బ్యాక్టీరియా జీవావరణానికి కలిగించే హాని ఎలా ఉంటుందో తెలుసుకునే నిమిత్తం పరీక్షలు చేసేందుకు క్రియారహిత దశలో ఉన్న బ్యాక్టీరియాను పంపాల్సి వుండగా, అది జరగలేదని, జీవించి ఉన్న బ్యాక్టీరియా ల్యాబ్ లకు చేరిందని ఆయన తెలిపారు. ఈ పొరపాటు 11 నెలల తరువాత వెలుగులోకి రావడం గమనార్హం.
More Telugu News
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!