బీహార్ లో పంచాయతీల దారుణాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా ఈ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఓ దారుణం అక్కడ నెలకొన్న ఆటవిక న్యాయాన్ని కళ్లకు కడుతోంది. గయకు సమీపంలోని ఓ గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే... పెళ్లయి ముగ్గురు పిల్లలున్న ఓ వ్యక్తి తన అత్తవారి ఇంటికి తరచూ వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో అత్తగారి గ్రామంలోని ఓ 16 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం హద్దులు దాటడంతో మూడు రోజుల క్రితం ఇద్దరూ కనిపించకుండా పోయారు. దీంతో వారి కోసం వెతికిన బంధువులు ఎట్టకేలకు వారిని పట్టుకుని పంచాయతీకి ఫిర్యాదు చేశారు. పంచాయతీ ఏర్పాటు చేసిన పెద్దలు, వారికి సజీవ దహనం శిక్ష విధించారు.
దీంతో పంచాయతీ పెద్దలు, బంధువులు, కన్నవారి సమక్షంలో వారిద్దరినీ విచక్షణా రహితంగా కొట్టి, సజీవ దహనం చేసేశారు. ఇంత దారుణం జరుగుతున్నా గ్రామంలో ఒక్కరు కూడా పోలీసులకు సమాచారమందించకపోవడం విశేషం. పక్కగ్రామంలోని వ్యక్తుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు, ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. 20 మంది అనుమానితులను గుర్తించారు. దీనిపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. సమాజంలో ఆటవికన్యాయం అమలు చేయడంపై హక్కుల సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్