టీవీ9 న్యూస్ యాంకర్ బద్రి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం బద్రి భౌతికకాయానికి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ శ్రద్ధాంజలి ఘటించారు. తరువాత మృతదేహాన్ని విజయవాడకు తరలించారు. అభిమానులు, శ్రేయోభిలాషులు, స్నేహితుల సందర్శనార్థం ఆయన నివాసం వద్ద మృతదేహాన్ని ఉంచనున్నారు. రేపు ఆయన పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ప్రమాదంలో గాయపడిన బద్రి భార్య లక్ష్మీసుజాత, పెద్ద కొడుకు సాయిదీపక్ పరిస్థితి విషమంగా ఉంది. వారికి వెంటిలేటర్ పై వైద్యసేవలు అందిస్తున్నారు. కాగా, బద్రి బావమరిది గండ్రోతు తారక్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బద్రి మృతికి మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల నేతలు, అభిమానులు సంతాపం తెలిపారు. మంచి మనిషిగా మన్ననలందుకున్న బద్రి మరణంపై అన్ని వర్గాల నుంచి స్పందన లభిస్తోంది. కాగా, బద్రి పార్థివదేహానికి టీవీ9 రవిప్రకాశ్, రజనీకాంత్ తదితరులు నివాళులర్పించారు.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్