బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్... ఏదయినా రోబోలే అందిస్తాయి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్... ఏదయినా రోబోలే అందిస్తాయి!

ఆధునిక సాంకేతికను జపనీయులు వినియోగించుకున్నంత గొప్పగా ఇంకెవరూ వాడుకోరేమో. సాంకేతిక వ్యవస్థను అందిపుచ్చుకోవడంలో అందరికంటే ముందుండే జపాన్ తాజాగా మరో కొత్త ఘనతను సొంతం చేసుకోనుంది. పూర్తిస్థాయిలో రోబోలతో సేవలందించేందుకు ఓ హోటల్ సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే రోబోలతో నడిచే తొలి హోటల్ గా ఇది చరిత్రకెక్కనుంది. జూలైలో దీనిని ప్రారంభిస్తామని నాగసాకి ప్రాంతానికి చెందిన హోటల్ యజమాని తెలిపారు. ఈ హోటల్ ను పూర్తిగా డచ్ శైలిలో నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. హుయ్ టెన్ బోష్ అనే ధీమ్ పార్కులో దీనిని ఏర్పాటు చేయనున్నారు. రోబోలను సిబ్బందిగా నియోగించడం వల్ల నిర్వహణా వ్యయం చాలా వరకు తగ్గుతుందని ఆయన వెల్లడించారు.

More Telugu News