తైవాన్ కు చెందిన ట్రాన్స్ఏషియా విమాన ప్రమాదంలో ఆసక్తికర అంశం వెలుగుచూసింది. విమాన పైలట్ తో పాటు కో-పైలట్ చాకచక్యంగా వ్యవహరించిన కారణంగా పెను ప్రమాదం తప్పిందని నిపుణులు తేల్చారు. చనిపోబోతూ కీలక నిర్ణయం తీసుకున్న సదరు పైలట్ నిర్ణయాన్ని వారు కీర్తిస్తున్నారు. అసలేం జరగిందంటే... 58 మంది ప్రయాణీకులతో బయలుదేరిన విమానం అదుపు తప్పింది. అదుపు తప్పిన విమానం కూలిపోతున్న దశలో ఆకాశహర్మ్యాల వైపుగా దూసుకెళ్లసాగింది.
పరిస్థితిని గమనించిన పైలట్, కో-పైలట్ సహకారంతో విమానాన్ని నదిలోకి మళ్లించాడు. దీంతో పల్టీలు కొడుతూనే విమానం నదిలో పడిపోయింది. అయితే, కూలిపోయే క్రమంలో ఒక్క బిల్డింగ్ ను కూడా విమానం తాకలేదు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించకపోయి ఉంటే, విమానం ఆకాశహర్మ్యాలను తప్పనిసరిగా ఢీకొట్టేదే. ఇదే జరిగి ఉంటే, భారీ ప్రాణ నష్టం సంభవించి ఉండేది. తాను చనిపోతున్నానని తెలిసినా, భారీ ప్రాణ నష్టాన్ని నివారించి పైలట్ ఆదర్శంగా నిలిచారని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్