కంచె చేను మేసింది. సమాజానికి రక్షణ కల్పించాల్సిన గురుతర బాధ్యతను మరచిన ఓ పోలీస్ కానిస్టేబుల్ చిన్నారి బాలిక పట్ల యముడిగా మారాడు. తల్లిదండ్రులతో కలసి జాతరకు వెళ్లి, తప్పిపోయిన బాలికను ఇంటికి తెచ్చుకున్న ఓ కానిస్టేబుల్ వెట్టి చాకిరీ చేయించుకున్నాడు. అంతేగాక, తిండి పెట్టకుండా, నిద్ర లేకుండా చేయడమే కాక నిత్యం కొడుతూ బాలికకు నరకం చూపించాడు.
కానిస్టేబుల్ కుటుంబం సాగించిన హింసాకాండలో తల, మెదడుకు తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సదరు బాలిక కొద్దిసేపటి క్రితం కన్నుమూసింది. తమ బిడ్డకు సంబంధించిన వార్తాకథనాల్లోని ఫొటోను చూసిన తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకునేలోగానే బాలిక కన్నుమూసింది. చనిపోయిన సదరు బాలికను నౌసిన్ బేగంగా పోలీసులు నిర్ధారించారు.
బాలికతో వెట్టిచాకిరీ చేయించుకున్న కానిస్టేబుల్ జాకీర్ పై పోలీసులు కేసు నమోదు చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు. మరోవైపు, తప్పిపోయిందనుకున్న కూతురు దొరికిందనుకున్న సంతోషంతో సంగారెడ్డికి పరుగుపరుగున వచ్చిన నౌసిన్ తల్లిదండ్రులు వచ్చీరాగానే కూతురు చనిపోయిందని తెలిసి శోకసంద్రంలో మునిగిపోయారు.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్