డ్రగ్స్ ఇచ్చి 100 మందిపై అత్యాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డ్రగ్స్ ఇచ్చి 100 మందిపై అత్యాచారం

మహిళలకు ఏ దేశంలోనూ రక్షణ లేదనే విషయం జపాన్ లో మరోసారి తేటతెల్లం అయింది. క్లినికల్ స్టడీ సెంటర్ లో వాలంటీర్లుగా పని చేసేందుకు జాయిన్ అయిన 100 మందికి పైగా మహిళలకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఘటన జపాన్ లో కలకలం రేపుతోంది. 2011వ సంవత్సరంలో ఒక స్టడీ సెంటర్ లో వైద్య విద్యలో భాగంగా వంద మంది యువతులు జాయిన్ అయ్యారు. వారంతా నిద్రిస్తున్న సమయంలో డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేయడం అక్కడ పరిపాటిగా మారిపోయింది. కాగా, ఆ మహిళలు 2013 నవంబర్ వరకూ ఆ సెంటర్ లో వాలంటరీలుగా విధులు నిర్వర్తించారు. జరిగిన ఘోరం యొక్క వీడియో ఒకటి వెలుగు చూసింది. దానిని ఇంటర్నెట్ లో పెట్టడమే కాకుండా, దానిని నీలిచిత్రాలు తీసే నిర్మాతలకు విక్రయించినట్టు జపాన్ పోలీసుల విచారణలో తేలింది. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దర్యాప్తులో మరో దారుణం వెలుగు చూసింది. ఇది ఒరిజినల్ క్లినిక్ స్టడీ సెంటర్ కాదని, భోగస్ దని తేల్చారు.

More Telugu News