బస్సుపై పెట్రోల్ బాంబు విసిరిన నిరసనకారులు... నిద్రిస్తున్న ఏడుగురు సజీవదహనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బస్సుపై పెట్రోల్ బాంబు విసిరిన నిరసనకారులు... నిద్రిస్తున్న ఏడుగురు సజీవదహనం

బంగ్లాదేశ్‌లో తాజాగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు చేపట్టిన నిరసన ప్రదర్శనలో దారుణం జరిగింది. ఢాకా నుంచి కాక్స్‌ బజార్ వైపు వెళుతున్న బస్సుపై ఈ తెల్లవారుజామున 4 గంటల సమయంలో కొందరు నిరసనకారులు పెట్రోల్ బాంబు విసిరారు. దీంతో, బస్సుకు మంటలు అంటుకోగా, దానిలో నిద్రిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. ఈ ఘటనలో మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించినట్టు అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు, నిరసనలకూ సంబంధం లేదని విపక్ష నేత ఖలీదా జియా వ్యాఖ్యానించారు.

More Telugu News