వరల్డ్ కప్ టైటిల్ ను టీమిండియా నిలబెట్టుకుంటుందా? సగటు అభిమాని మస్తిష్కంలో మెదులుతున్న ప్రశ్న ఇది. ఆస్ట్రేలియా సిరీస్, ముక్కోణపు టోర్నీలో భారత ఆటగాళ్ల ప్రదర్శన చూసిన సీనియర్లు కూడా టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదా నిలబెట్టుకోవడం అసాధ్యమని తేల్చేశారు. భారత దేశానికి తొలి వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ కపిల్ దేవ్ టీమిండియా వరల్డ్ కప్ సాధించే అవకాశం కేవలం 25 శాతమేనని అన్నారు.
ఏదైనా మ్యాచ్ లో విజయం సాధించిన తరువాత ఆటగాళ్లు గుంపుగా చేరి, ఐకమత్యం ప్రదర్శించడం సాధరణమని అన్న ఆయన, మ్యాచ్ కు ముందు మైదానంలో దిగిన తరువాత గుంపుగా ఎందుకు ఆలింగనం చేసుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదని అన్నారు. మైదానం బయట, డ్రెస్సింగ్ రూంలో ఏం చేస్తున్నారు? గుడ్లు తింటున్నారా? అక్కడే ఆలింగనం చేసుకోవచ్చుకదా? అని ఆయన సూచించారు.
విరాట్ కోహ్లీ తన ప్రియురాలికి సెంచరీ చేసిన తరువాత ఫ్లైయింగ్ కిస్ లు ఇస్తే తప్పేముందన్న ఆయన, పరుగులేమీ చేయకుండా ఫ్లైయింగ్ కిస్ లు ఇస్తే మాత్రం సరికాదని ఆయన పేర్కొన్నారు. కాలంతో పాటు మార్పులను కూడా స్వాగతించాలని ఆయన సూచించారు.
More Telugu News
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!