పాకిస్థానీ రేంజర్ల హతం విషయంలో ఆ దేశ వాదనను భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సమర్ధవంతంగా తిప్పికొట్టారు. పాక్ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఆధారాలతో తేల్చేశారు. అసలు విషయాలను ప్రస్తావించిన సుష్మా, పాక్ ప్రధానికి విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ రాసిన లేఖకు ఘాటుగా సమాధానమిచ్చారు. చర్చలకు పిలిచి తమ దేశ సైనికులిద్దరిని భారత సైన్యం హత్య చేసిందని ఆరోపిస్తూ ఈ నెల 2న అజీజ్, సుష్మాకు లేఖ రాశారు.
డిసెంబర్ 31న జరిగినట్లుగా భావిస్తున్న ఈ ఘటనపై భారత సైన్యం నుంచి సమగ్ర వివరాలను సేకరించిన సుష్మా, నిన్న అజీజ్ లేఖను తూర్పారబడుతూ ఘాటు వ్యాఖ్యలతో లేఖ రాశారు. ‘ఆ రోజు పాక్ కు చెందిన ఓ జెండా మా భూభాగంలో కనిపించింది. దానిని పరిశీలించేందుకు వెళ్లిన మా సైనికులపై పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మా సైనికుడొకరు చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆత్మరక్షణ కోసం మా సైన్యం జరిగిన కాల్పుల్లో ఇద్దరు పాక్ రేంజర్లు హతమయ్యారు. ఇప్పటికైనా వాస్తవాలను తెలుసుకుని మాట్లాడండి’’ అంటూ సుష్మా తన లేఖలో అజీజ్ తీరును ఖండించారు.
More Telugu News
-
పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక
-
టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు
-
తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి
-
మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!
-
డిసెంబర్లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ
-
మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి
-
ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్
-
కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్‌లు
-
అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్
-
తిరుమల అప్డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?
-
ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్
-
భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు
-
యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం
-
రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!
-
మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్