వరంగల్ జిల్లాలో నకిలీ మావోయిస్టుల హల్ చల్
వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో నకిలీ మావోయిస్టులు హల్ చల్ చేశారు. తుపాకీతో గొర్రెల కాపర్లను బెదిరించి, గొర్రెలను అపహరించే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన గొర్రెల కాపర్లను చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రదేశానికి వెళ్లారు. పోలీసులపై కాల్పులు జరిపిన నకిలీలు పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని వెంటాడిన పోలీసులు ఇద్దరు దుండగులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఓ తపంచాను స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన మరో ముగ్గురి కోసం గాలింపు చేపట్టారు.