ఈ ప్రకటనకు ఇంకా మూడు రోజుల సమయముంది కదా అంటారా? ఉంటే ఉండొచ్చు కాని, సోమవారమైనా టైమ్స్ ప్రకటించేది భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరునేగా. ఎందుకంటే, టైమ్స్ ప్రజాభిప్రాయ సేకరణలో బుధవారం నాటికి మోదీ 12.8 శాతం ఓట్లతో అగ్రస్థానానికి ఎగబాకి తన తర్వాతి స్థానాల్లో ఉన్నవారికి అందనంత వేగంగా దూసుకెళుతున్నారు. ఇక మోదీ తర్వాత రెండో స్థానంలో కొనసాగతున్న ఫెర్గూసన్ ఆందోళనకారులు 10.1 శాతం ఓట్లతో మోదీ కంటే చాలా వెనుకబడి ఉన్నారు. వీరు మోదీ కంటే ఎక్కువ ఓట్లను సాధించడం దాదాపుగా అసాధ్యమని సాక్షాత్తు టైమ్స్ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వాహకులే చెబుతున్నారు.
ఏటా డిసెంబర్ 6న ప్రజాభిప్రాయ సేకరణను ముగించే టైమ్స్, 8న విజేతను ప్రకటిస్తుంది. ఇక ఈ పోటీలో మూడో స్థానానికి ఎగబాకిన హాంకాంగ్ ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమనేత జోషువా ఓంగ్ 7.5 శాతం ఓట్లను సాధించారు. పాకిస్థాన్ బాలల హక్కుల ఉద్యమకర్త మలాలా యూసుఫ్ జాయ్ 5.2 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అత్యంత ధైర్యసాహసాలు చూపి ఎబోలా వ్యాధిగ్రస్తులకు చికిత్సలు అందించిన వైద్యులు, నర్సులు 4.5 శాతం ఓట్లను దక్కించుకుని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (4.1 శాతం ఓట్లు) ను ఆరో స్థానానికి దిగజార్చేసి ఐదో స్థానానికి ఎగబాకారు. ఇక అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ఈ జాబితాలో కేవలం 2.3 శాతం ఓట్లతో 11వ స్థానంలో కొనసాగుతున్నారు.
More Telugu News
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు