బొగ్గు క్షేత్రాల కేటాయింపుల స్కాంలో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ (అప్పటి బొగ్గు శాఖ మంత్రి కూడా)ను ఎందుకు విచారించలేదని సీబీఐని అత్యున్నత న్యాయస్థానం సూటిగా ప్రశ్నించింది. ఇందుకు సీబీఐ స్పందిస్తూ "ఈ కేసులో తొలుత పీఎంవో అధికారిని ప్రశ్నించాం. దాంతో బొగ్గు శాఖ మంత్రిని కూడా విచారించాల్సిన అవసరం లేదని భావించాం" అని కోర్టుకు తెలిపింది. కాగా, ఈ కేసుకు సంబంధించిన ఇతర పత్రాలతో పాటు ఈ కేసు డైరీని కూడా తమకు సమర్పించాలని కోర్టు కోరగా, సీల్డు కవర్ లో ఇస్తామని సీబీఐ తెలిపింది. యూపీఏ-2 హయాంలో చోటుచేసుకున్న ఈ స్కాంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బొగ్గు మంత్రిత్వ శాఖను ప్రత్యక్షంగా పర్యవేక్షించేవారు. ఈ సమయంలో పారిశ్రామికవేత్త, ఆదిత్యా బిర్లా గ్రూపు ఛైర్మన్ కుమార మంగళం బిర్లాకు హిందాల్కో బొగ్గు క్షేత్రాన్ని కేటాయించారు. ఈ కేసు తాజా విచారణలోనే కోర్టు పైవిధంగా అడిగింది.