స్వామీజీ ఆశ్రమంలో తుపాకులు, బాంబులు దొరికాయి. అంతకంటే విస్మయం కలిగించే అంశం ఏమిటంటే, గృహస్థాశ్రమం వదిలేసి సన్యాసం స్వీకరించాక కూడా గర్భనిర్ధారణ కిట్లు దొరకడం... హర్యానాలో వివాదాస్పద బాబా రాంపాల్ అరెస్టు సందర్భంగా అతని ఆశ్రమంపై దాడి చేసిన పోలీసులకు ఇలాంటి విస్తుపోయే నిజాలు దర్శనమిచ్చాయి. ఆశ్రమం, పవిత్రత, భగవంతుడి పేరిట బాబా రాంపాల్ ఓ చిన్న సామ్రాజ్యాన్ని తయారు చేసుకున్నారు. 1600 బాత్రూంలు, 1100 టాయ్ లెట్ల సౌకర్యంతో వసతి గృహాలు, ఐదు అంతస్థుల భవనంలో ప్రత్యేకమైన లిఫ్టు సౌకర్యం, బుల్లెట్ ప్రూఫ్ చైర్, ఆయుధ గారం బయటపడ్డాయి.
అలాగే రివాల్వర్లు, మిరపకాయ బాంబులతో పాటు గర్భనిర్ధారణ కిట్లు బయటపడ్డాయి. దీంతో ఆశ్రమంలో జరిగేది, జరుగుతోంది ఏంటనే దానిపై సర్వత్ర ఆసక్తి రేగుతోంది. బాబా రాంపాల్ వ్యక్తిగత గదిలో కూడా కిట్ ఉండడం విశేషం. రాంపాల్ భక్తులను ఉద్దేశించి ప్రసంగించే స్థలం కింద సొరంగం లాంటి గది ఉంది. ఆ గదిలో మూడు .32 బోర్ రివాల్వర్లు, 19 ఎయిర్గన్లు, రెండు .12 బోర్ రైఫిళ్లు, రెండు .315 బోర్ రైఫిళ్లు, మిర్చి గ్రెనేడ్లు, వాటి క్యార్ట్రిడ్జిలు, భారీ మొత్తంలో ఇతర ఆయుధాలు, మందు గుండు సామగ్రి కూడా లభ్యమయ్యాయని వారు తెలిపారు.
ఆ గదిలోని హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా స్వామి కుర్చీమీద అకస్మాత్తుగా భక్తులకు దర్శనమిచ్చి ఆశ్చర్యపరుస్తూ ఉండేవారు. బాబా రాంపాల్ అరెస్టు అనంతరం ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన సుమారు 865 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, జైలులో ఉన్న బాబా రాంపాల్ ఎవరితోనూ మాట్లాడటం లేదని జైలు సిబ్బంది చెబుతున్నారు.
More Telugu News
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు