పెళ్లి చేసుకోవడం, తరువాత భర్తను హతమార్చడం, వారి పేరిట ఉన్న బీమా సొమ్మును వసూలు చేసుకోవడం, ఇంకొకడికి స్కెచ్ గీయడం... ఇలా ఆరుగురిని హతమార్చి సుమారు 53 కోట్ల రూపాయలు వెనకేసిందో మహిళ. ఇప్పుడు తనకో భర్త కావాలంటూ చైనాలోని మ్యారేజీ బ్యూరోల్లో గాలిస్తోంది. వివరాల్లోకి వెళితే... కొన్ని రకాల ఆడ సాలీళ్లు సంభోగం తరువాత మగ భాగస్వామిని చంపేస్తాయి.
ఇలా భర్తలను చంపేసే వారిని సాలీళ్ల పేరిట 'బ్లాక్ విడో'లుగా పిలుస్తారు. జపాన్ లోని క్యోటోలో నివసించే చిసాకో కకెహి (67) అనే మహిళ, మనువాడిన ఆరుగురు భర్తలను చంపేసింది. వారిలో చివరి వ్యక్తి 2013 డిసెంబర్ నెలలో మృతి చెందాడు. వారంతా మరణించిన అనంతరం వారి పేరిట ఉన్న బీమాను వసూలు చేసుకుని జీవనం సాగిస్తోంది. ఇలా బీమా రూపంలో గత పదేళ్లలో ఆరుగురు భర్తల మృతి కారణంగా ఆమె సుమారు 53 కోట్ల రూపాయలు వెనకేసుకుంది. ఇప్పుడు మరో భాగస్వామి కోసం వెతుకులాట మొదలు పెట్టింది.
తనకు కావాల్సిన వాడు ముసలివాడై ఉండాలి, బాగా డబ్బున్న వ్యక్తై ఉండాలి, ఒక్కడే నివసిస్తూ ఉండాలని కూడా మ్యారేజి బ్యూరోలకు స్పష్టం చేస్తోంది. ఆమె తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు క్యోటోలోని ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆమె ఇంట్లో వారికి సైనైడ్ ఆనవాళ్లు కనిపించాయి. కాగా, ఆమె తన భర్తలను చంపిన విషయాన్ని అంగీకరించకపోవడం విశేషం. కాగా, ఇటీవలే కనే కిజిర్నా అనే మధ్య వయసు మహిళ ముగ్గురు భర్తలను చంపి వాళ్ల ఆస్తులు చేజిక్కించుకుందని వార్తాపత్రికలు వెల్లడించాయి.
More Telugu News
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు