ఇంకెప్పుడూ రాజీనామా చేయను... నేను నేర్చుకున్న పాఠం ఇదే: కేజ్రీవాల్
ఓ పదవిలో ఉండి ప్రజలకు సేవ చేసే అవకాశం లభిస్తే ఎన్నడూ రాజీనామా చేయకూడదని, తన జీవితంలో తాను నేర్చుకున్న పాఠం అదేనని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. పదవిలో ఉన్న 50 రోజుల్లో ఎంతో నేర్చుకున్నానని అన్నారు. ఐఐఎఫ్ఎల్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ చార్జీలను 50 శాతం తగ్గించామని, ప్రతి కుటుంబానికి నెలకు 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా అందించాలని నిర్ణయించామని కేజ్రీవాల్ గుర్తు చేశారు.