దూరప్రాంతాల్లో వెళ్లే రైళ్లలో క్యాటరింగ్ ఎంత నాసిరకంగా ఉంటుందో మరోసారి తేటతెల్లమైంది. ఆహారంలో కీటకాల అవశేషాలు, నాణ్యతలేని వంటకాలతో భారత రైల్వే శాఖ అభాసుపాలవుతోంది. తాజాగా, రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఓ ప్రయాణికుడు శాకాహారం తెప్పించుకుంటే, అందులో ఎముకలు కనిపించాయి. గౌహతి వెళ్లే రాజధాని ఎక్స్ ప్రెస్ లో సెప్టెంబర్ 19న తికమ్ చంద్ జైన్ (65) అనే వ్యక్తి ఢిల్లీలో ఎక్కాడు. ఆ మరుసటి రోజు శాకాహారం ఆర్డర్ చేశాడు. వెయిటర్ తెచ్చివ్వడంతో దాన్ని ఓపెన్ చేసి తినడం ప్రారంభించాడు.
తాను నములుతున్నది ఎముకలని గుర్తించిన జైన్ వెంటనే మేనేజర్ కు ఫిర్యాదు చేశాడు. అనంతరం రైల్వే శాఖ ప్రధాన కార్యాలయానికి లేఖ రాశాడు. దీంతో, రైల్వే శాఖ శాకాహారంలో ఎముకల విషయమై విచారణ చేపట్టింది. జైన్ తన సహప్రయాణికుడు ఎంపిక చేసుకున్న నాన్ వెజ్ భోజనాన్ని తీసుకున్నాడని తెలిపింది. అటు, వెయిటర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడంటూ, నార్తర్న్ రైల్వే, క్యాటరింగ్ సర్వీస్ ప్రొవైడర్ కు లక్ష రూపాయల జరిమానా విధించింది.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్