తిరుమల వెంకన్న ప్రసాదం ప్రపంచ ప్రసిద్ధం. వెంకన్న భక్తులే కాక ఇతర మతాల వారు కూడా ఈ ప్రసాదంపై మక్కువ చూపడం కద్దు. ఏళ్లుగా తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్న తిరుమల లడ్డూ త్వరగా పాడవుతోందన్న భక్తుల ఫిర్యాదులకు ఇప్పుడు బెంగకు చెక్ పడుతోంది. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ) తాజాగా రూపొందించిన ప్రత్యేక ప్యాక్ తో తిరుమల ప్రసాదం 90 రోజుల దాకా నిక్షేపంగా ఉంటుంది.
కేవలం రూ.1-2 మధ్య ఖర్చుతో తయారు చేయనున్న ఈ ప్యాకెట్ ను తిరుమలకు అందించేందుకు టీటీడీ బోర్డుతో చర్చలు జరుపుతున్నట్లు ఐఐపీ ఎన్.సీ.సాహా తెలిపారు. తిరుమలకు వస్తున్న భక్తులకే కాక రాలేని పరిస్థితిలో ఉన్న భక్తులకు కూడా ప్రసాదాన్ని అందించేందుకు గతంలోనే టీటీడీ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అంతేకాక తిరుమలకు వస్తున్న సుదూర ప్రాంతాల భక్తులు స్వామి వారి దర్శనం తర్వాత తిరిగి ఇళ్లకు వెళ్లేందుకు రోజుల తరబడి సమయం పడుతోంది. దీంతో వెంకన్న ప్రసాదం ఎక్కడ పాడవుతుందోనన్న ఆదుర్దా భక్తుల్లో ఉండేది. ఇప్పుడీ కొత్త ప్యాక్ తో దానికి చెక్ పెట్టచ్చని సాహా తెలిపారు.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్