రానున్న కొన్నేళ్లలో భారత్ లో రూ.60 వేల కోట్ల (10 బిలియన్ డాలర్లు) మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు జపాన్ కుబేరుడు మసయోషి సన్ ప్రకటించారు. టెలికాం, ఇంటర్నెట్ సేవల్లో జపాన్ అగ్రగామి సంస్థ సాఫ్ట్ బ్యాంక్ వ్యవస్థాపకుడిగానే కాక ఛైర్మన్ గానూ వ్యవహరిస్తున్న సన్, కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో భేటీ సందర్భంగా ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న ఆయన తన పెట్టుబడులకు సంబంధించిన స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2000 సంవత్సరంలో చైనా ఈ-కామర్స్ సంస్థ అలీబాబాలో సన్ 20 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టారు. భారత ఈ-కామర్స్ సంస్థ స్నాప్ డీల్ లోనూ 650 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టిన సన్, మెజారిటీ వాటాదారుగా కొనసాగుతున్నారు. ఇక ఒలాక్యాబ్స్ లోనూ 180 మిలియన్ డాలర్లను ఆయన పెట్టుబడిగా పెట్టారు. మొబైల్ అడ్వర్టైజింగ్ లో భారతీ ఎయిర్ టెల్ తో కలిసి ఇన్ మోబీ సంస్థను సాఫ్ట్ బ్యాంక్ నిర్వహిస్తోంది. భారత ఐటీ కంపెనీలు స్థిరమైన రాబడులతో ఇన్వెస్టర్లకు భారీ లాభాలు అందిస్తున్న వైనం సన్ ను ఆకట్టుకుంది.
More Telugu News
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!