పక్కింటి ప్రియురాలి కోసం కట్టుకున్న భార్యను కడతేర్చాడో కామాంధుడు. ఉత్తరప్రదేశ్ లో సంచలనం సృష్టించిన బిస్కెట్ కింగ్ ఓంప్రకాశ్ దాసాని కోడలి హత్యకేసును పోలీసులు ఛేదించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... కోట్లకు పడగెత్తిన కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టిన జ్యోతి దాసాని(27) భర్త పన్నిన కుట్రలో బలైంది. భర్త పియూష్ దాసాని(30)తో కలిసి ఆదివారం రాత్రి బయటకు వెళ్లింది జ్యోతి.
అలా వెళ్తుండగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు తమ వాహనాన్ని అడ్డగించారని... తనను కారులోంచి తోసేసి, జ్యోతిని కిడ్నాప్ చేశారని పోలీసులకు పియూష్ దాసాని ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకోణంలో దర్యాప్తు చేసిన పోలీసులకు ఏ విధమైన క్లూ లభించకపోవడం, జ్యోతి భర్త మాటల్లో పొంతన లేకపోవడంతో అతనిపై నిఘా పెట్టారు. అతని సెల్‌ఫోన్ కాల్‌డేటా, ఎస్సెమ్మెస్‌లు, అతడు తిరిగిన ప్రదేశాల్లోని సీసీటీవీ ఫుటేజ్ వంటివన్నీ పరిశీలించారు.
ఇక్కడే జ్యోతి హత్యకేసు మలుపు తిరిగింది. పియూష్ చెప్పినదంతా అబద్ధమని, భార్యను అతడే చంపేసి... ఆపై కట్టుకధలు అల్లాడని పోలీసులు నిర్ధారించారు. హత్యకు ప్రధాన సూత్రధారి పియూషేనని... తన ప్రియురాలు, డ్రైవర్ అవదేష్, అతడి స్నేహితుడు రేణు కానౌజియా సాయంతో జ్యోతిని కడతేర్చాడని పోలీసులు స్పష్టం చేశారు. ఎట్టకేలకు పియూష్ పోలీసుల ఎదుట నేరం అంగీకరించాడు. పియూష్ ప్రతిరోజు అర్థరాత్రి ఒంటిగంట నుంచి 4 గంటల వరకు కనిపించేవాడు కాదు. దీంతో అతని వ్యవహార శైలిపై జ్యోతి కుటుంబంలోని పెద్దవాళ్లకు ఫిర్యాదు చేసింది.
ఈ సమయంలో అతను అకస్మాత్తుగా మాయం అవడానికి అసలు కారణం బయటపడింది. పొరుగింట్లో ఉండే మనీషా మఖీజాతో పియూష్ ఎఫైర్ చాలాకాలంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆమె గర్భందాల్చింది. దీంతో పెళ్లి చేసుకోవాలంటూ పియూష్పై మనీషా మఖీజా ఒత్తిడి తెచ్చింది. దీంతో అప్పటికే పెళ్లైన పియూష్ ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలంటే జ్యోతిని అడ్డుతొలగించుకోవడమే మార్గమని భావించి ఆమెను కడతేర్చాడు.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్