రెండవ ప్రపంచయుద్ధం సందర్భంగా అమెరికా బాంబర్ బి-29 జపాన్ నగరం హిరోషిమాపై అణుబాంబు వేయడం తెలిసిందే. బాంబు వేసిన సమయంలో బి-29లో ఉన్న సిబ్బందిలో థియోడర్ వాన్ కిర్క్ (93) ఒకరు. మిగిలిన సిబ్బంది ఎప్పుడో మరణించగా, వాన్ కిర్క్ సోమవారం తుదిశ్వాస విడిచారు. దీంతో, ఆనాటి చారిత్రక ఘటనలో ప్రత్యక్షంగా పాలుపంచుకున్న చివరి వ్యక్తి కూడా మరణించినట్టయింది.
వృద్ధాప్యంతోనే ఆయన కన్నుమూశారని వాన్ కిర్క్ కుమారుడు టామ్ తెలిపారు. కాగా, వాన్ కిర్క్ తన ఉద్యోగకాలంలో 60 బాంబింగ్ ఆపరేషన్లలో పాల్గొన్నారు. జపాన్ పై చేపట్టిన ఒక్క బాంబింగ్ ఆయనకు చరిత్రలో స్థానం కల్పించింది. ఆ ఆపరేషన్ లో ఆయన ప్లేన్ నావిగేటర్ గా విధులు నిర్వర్తించారు.
రెండో ప్రపంచయుద్ధ చివరి దశలో అమెరికా 1945 ఆగస్టు 6న హిరోషిమాపై అణుబాంబు జారవిడిచింది. ఆ బాంబు పేరు లిటిల్ బాయ్ కాగా, దాని బరువు 9 వేల కిలోలు. ఈ ఘటనలో హిరోషిమా నేలమట్టం కాగా, పేలుడు కారణంగానూ, తదనంతర ప్రభావాల కారణంగానూ మొత్తం 1,40,000 మంది చనిపోయారు.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్