లండన్ ఒలింపిక్స్, సాకర్ వరల్డ్ కప్, గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ ఇలా ఎక్కడ ఆటలపోటీలు జరిగినా నిర్వాహకులు వసతి, భోజనం, గ్రౌండ్, శుభ్రత వంటి అన్ని సౌకర్యాలు కల్పించగలుగుతున్నారు కానీ కండోమ్ లు మాత్రం సరిపడా సరఫరా చేయలేకపోతున్నారు. గత సంఘటనలను దృష్టిలో ఉంచుకుని స్కాట్లాండ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో కండోమ్స్‌ను భారీ సంఖ్యలో సరఫరా చేసింది.
మహిళల కండోమ్స్ సహా పలు కంపెనీలకు చెందిన నాణ్యమైన పది రకాల కండోమ్స్ ను క్రీడాకారులు, ప్రేక్షకుల కోసం అందుబాటులో ఉంచారు. పోటీలు జరిగే 300 వేదికలకూ కండోమ్స్‌ను సరఫరా చేశారు. దాదాపు 84 వేలకు పైగా కండోమ్స్‌ను సరఫరా చేసినట్టు అధికారులు తెలిపారు. క్రీడాకారులు, ఇతర స్టాఫ్ తమకు నచ్చినవాటిని ఉచితంగా తీసుకోవచ్చు. ఇతరులు మాత్రం కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
కాగా, కామన్వెల్త్ గేమ్స్ లో 71 దేశాలకు చెందిన క్రీడాకారులు పోటీ పడుతున్నారు. కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా గ్లాస్గోలో హోటల్స్, బార్లు కళకళలాడిపోతున్నాయి. క్రీడలను తిలకించేందుకు ప్రతివారం 7.5 లక్షల మంది నగరానికి వస్తున్నారు. మెగా ఈవెంట్లు నిర్వహించే ప్రతిసారి క్రీడాకారుల అద్భత ప్రదర్శన, పతకాల ముచ్చట్ల తరువాత వచ్చేది కండోమ్ ల ప్రస్తావనే అంటే అతిశయోక్తి కాదు.
రెండేళ్ల క్రితం జరిగిన లండన్ ఒలింపిక్స్, తాజాగా బ్రెజిల్ లో జరిగిన సాకర్ వరల్డ్ కప్ లకు రికార్డు స్థాయిలో కండోమ్స్‌ను సరఫరా చేసినా కొరత ఏర్పడింది. ఇక గతంలో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో అయితే క్రీడాకారులు, కోచ్‌లు, సహాయ సిబ్బంది కోసం నిర్మించిన క్రీడాగ్రామంలో కండోమ్స్ అడ్డుపడి డ్రైనేజ్ బ్లాక్ అయిపోయిందంటే వీటి డిమాండ్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్