రాష్ట్రపతిగా ఇటీవలే రెండేళ్లు పూర్తిచేసుకున్నారు ప్రణబ్ ముఖర్జీ. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి భవన్ లో ఒక ప్రత్యేక మ్యూజియంను ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ల సమక్షంలో ప్రారంభమైన ఈ మ్యూజియమ్ ను దేశానికి అంకితం ఇస్తున్నట్లు ప్రణబ్ ప్రకటించారు. దేశాన్ని ఇప్పటివరకూ పాలించిన రాష్ట్రపతులు, వారి వివరాలు, రాష్ట్రపతిభవన్ చరిత్రను మొత్తం ఈ మ్యూజియంలో నిక్షిప్తం చేశారు.
అంతేకాకుండా గతంలో రాష్ట్రపతులు అందుకున్న ప్రతిష్ఠాత్మకమైన బహుమతులను కూడా ఈ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. రాష్ట్రపతి భవన్లో ఇప్పటివరకూ వినియోగించని వస్తువులను కూడా శుభ్రపరిచి మ్యూజియంలో సందర్శకులకోసం ఏర్పాటు చేస్తున్నారు. ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ఈ మ్యూజియం ప్రజల సందర్శనార్థం ప్రారంభమవుతుంది. మ్యూజియాన్ని చూడటానికి ప్రవేశ రుసుము ఉంటుంది.
రాష్ట్రపతి భవన్ లో ఉన్న డాక్టర్ రాజేంద్రప్రసాద్ సర్వోదయవిద్యాలయంలో ఓ విజ్ఞాన కేంద్రాన్ని కూడా ప్రణబ్ ఏర్పాటు చేయించారు. ఈ నాలెడ్జ్ హబ్ టీచర్లకు, విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్రపతి భవన్ వర్గాలు అంటున్నాయి.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్