ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ సమీపంలో ఆ దేశ అధ్యక్ష భవనం ఉద్యోగులు ప్రయాణిస్తున్న వాహనం లక్ష్యంగా జరిగిన బాంబు దాడిలో ఇద్దరు మరణించారు. మరో ఐదుగురు ఉద్యోగులు గాయపడ్డారు. వాహనం ప్రయాణిస్తున్న రోడ్డు మధ్య భాగంలో అమర్చిన ఈ బాంబును దుండగులు రిమోట్ తో పేల్చివేశారని ఆఫ్ఘన్ పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఒక్క సంస్థ ప్రకటించలేదు.