త్రిపురలో ఓ వార్తాపత్రిక ఎడిటర్ ముగ్గురు ఉద్యోగులను హత్యచేసినట్టు తేలింది. దైనిక్ గందూట్ అనే పత్రిక యజమాని-ఎడిటర్ సుశీల్ కుమార్ చౌధరీ తన సంస్థలోనే పనిచేస్తున్న మేనేజర్ రంజిత్ చౌధరీ, ప్రూఫ్ రీడర్ సుజిత్ భట్టాచార్జీ, డ్రైవర్ బలరాం ఘోష్ అనే ముగ్గురు ఉద్యోగులను హత్య చేశాడని పోలీసులు విచారణలో తేల్చారు. ఈ మేరకు అగర్తలా కోర్టులో ఆధారాలు ప్రవేశపెట్టగా, సుశీల్ కుమార్ ను దోషిగా నిర్ధారించారు. సుశీల్ కుమార్ చాలా హై ప్రొఫైల్ వ్యక్తి అని, గతంలో రాష్ట్రపతులు, ప్రధానులు విదేశీ టూర్లకు వెళ్ళేటప్పుడు వారివెంట ఉండే మీడియా బృందంలో ఈయన కూడా ఉండేవాడని తెలుస్తోంది.
అయితే, అక్రమ భూదందాల్లో తలదూర్చడంతో ఆ రహస్యాలు వెల్లడి చేస్తాడేమోనని తొలుత మేనేజర్ ను చంపాడు సుశీల్ కుమార్. ఆ ఘోరానికి సాక్ష్యులైన ప్రూఫ్ రీడర్, డ్రైవర్ లను సైతం హత్యచేశాడు. ఈ ముగ్గురి మృతదేహాలు చౌధరీ చాంబర్లోనే పడి ఉండడంతో అనుమానాలు అతడిపైకే మళ్ళాయి. అయితే, తనను లక్ష్యంగా చేసుకుని కొందరు ఈ హత్యలు చేశారని తొలుత బుకాయించాడు సుశీల్ కుమార్. అయితే, ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారన్నది చెప్పలేకపోయాడు.
కాగా, హత్యల సమయంలో అక్కడ డ్రైవర్ భార్య కూడా ఉన్నట్టు తెలిసింది. ఆమెను అరెస్టు చేసి విచారించగా, అప్రూవర్ గా మారి సుశీల్ కుమార్ గుట్టు రట్టు చేసింది. అయితే, తొలుత ఆమె సుశీల్ కుమార్ కు వంతపాడడం గమనార్హం. సుశీల్ కుమార్ కు మరణశిక్ష గానీ, జీవితఖైదు గానీ విధించే అవకాశాలున్నాయి.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్