ఐదు రాష్ట్రాలకు (గుజరాత్, పశ్చిమబెంగాల్, ఛత్తీస్ గఢ్, నాగాలాండ్, ఉత్తరప్రదేశ్) కొత్త గవర్నర్లను నియమించడానికి రంగం సిద్ధమైంది. బీజేపీ సీనియర్లు అయిన రామ్ నాయక్, వీకే మల్హోత్రా, కేశ్రీనాథ్ త్రిపాఠి, కైలాష్ జోషి, బలరాందాస్ టాండన్ ల పేర్లను కేంద్రం సూచించింది. వీరి నియామకాలకు రాష్ట్రపతి ప్రణబ్ ఆమోదముద్ర వేశారు. అయితే ఎవరెవరిని ఏయే రాష్ట్రాల్లో నియమిస్తారో అన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.