కృష్ణాజిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు వద్ద మట్టిదిబ్బ కూలి ఐదుగురు కూలీలు మరణించారు. మృతులను గోవింద్, గోపాల్ రెడ్డి, సలీం, సుబ్బు, నందుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.9.60 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.5 లక్షలు, జెన్ కో రూ.2.50 లక్షలు, నల్గొండ కార్మిక విభాగం తరఫున రూ.2.10 లక్షల నష్టపరిహారాన్ని ఇస్తామని అధికారులు తెలిపారు.