కాసేపట్లో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరుగుతుంది. పార్లమెంటరీ పార్టీ నేత, లోక్ సభ ఫ్లోర్ లీడర్ ను ఈ సమావేశంలో చంద్రబాబు ఎంపిక చేస్తారు. అంతే కాకుండా, కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులను రాబట్టే విషయంలో కేంద్ర మంత్రులతో ఎలా వ్యవహరించాలన్న విషయంపై పార్టీ ఎంపీలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు. దివంగత నేత గోపీనాథ్ ముండేకు అంజలి ఘటించిన అనంతరం సమావేశం ప్రారంభం అవుతుంది.