దొంగతనం చేసి ఫేస్ బుక్ లో ఫ్రెండ్ షిప్ రిక్వెస్ట్
ఓ జాదూ దొంగ ఏం చేశాడో తెలుసా? ఓ మహిళ దగ్గర వస్తువులు కొట్టేసి.. మర్నాడు మనం ఫ్రెండ్స్ అవుదామా? ప్లీజ్ అని అడిగాడు. అమెరికాలోని వాషింగ్టన్ లో కిట్సాప్ కౌంటీలో ఇది జరిగింది. బ్రెమెర్టన్ ఫెర్రీ టెర్మినల్ లో ఒక మహిళ రైలు కోసం వేచి చూస్తోంది. హెడ్ సెట్ పెట్టుకుని పాటలు వింటోంది. ఈ లోపు ఓ దొంగ రానే వచ్చాడు. ఆమె ఐపాడ్, పర్సు లాక్కుని పరారయ్యాడు. దొంగ ముఖాన్ని ఆమె చూడలేకపోయింది. కాకపోతే దొంగ మెడపై త్రికోణాకారంలో టాట్టూ గుర్తు ఉండడం ఆమె కంట్లో పడింది. మర్నాడు ఆమె ఫేస్ బుక్ ఖాతాకు ఓ ఫ్రెండ్ షిప్ రిక్వెస్ట్ వచ్చింది. చూస్తే ప్రొఫైల్ పిక్ లో ఆ దొంగ ఫొటో ఉండడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దొంగను ముల్లిన్స్ గా గుర్తించి కేసు నమోదు చేశారు.