పాకిస్థాన్ లోని సెంట్రల్ పంజాబ్ ప్రావిన్స్ నుంచి కలమ్ హిల్ స్టేషనుకు వెళుతుండగా బస్సు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 16 మంది మరణించారు. స్వాత్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఐదుగురు మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నారు. మరో ఏడుగురు క్షతగాత్రులయ్యారు.