ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటే లోక్ సత్తా సిద్దాంతాలమీద జరిగింది: జేపీ
ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు లోక్ సత్తా సిద్ధాంతాలమీద జరిగిందని లోక్ సత్తా జాతీయ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 11న అరవింద్ కేజ్రీవాల్ బృందంతో లోక్ సత్తా బృందం చర్చిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో లోక్ సత్తాతో ఆప్ కలిసి పని చేస్తుందని తాను భావిస్తున్నానని జేపీ తెలిపారు. అసెంబ్లీలో నేతలు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని సూచించారు.
తెలంగాణ వాదం ఉన్నట్టే సమైక్యవాదం ఉండడం కూడా తప్పుకాదని అన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల నేతలకు అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉందని ఆయన తెలిపారు. సభలో ప్రధానంగా రెండు అంశాలపై చర్చ జరగాలని ఆయన సూచించారు. ఒకటి బిల్లుపై జనరల్ చర్చ జరిగి ఓటింగ్ జరగాలని అన్నారు. అలాగే అంశాలవారిగా చర్చ జరిపి దానిపై కూడా ఓటింగ్ జరపాలని ఆయన సూచించారు.
అసెంబ్లీలో ఎక్కువ మంది ఇప్పటి వరకు ఏర్పడిన రాష్ట్రాల్లాగే కొత్త రాష్ట్రం కూడా ఏర్పడాలని భావిస్తున్నారని ఆయన తెలిపారు. అందరి అభిప్రాయాలను చెప్పే వేదిక అసెంబ్లీయేనని ఆయన అన్నారు. అసెంబ్లీ కాకుండా ఇంకా ఏదయినా వేదిక ఉంటే సభను అడ్డుకుంటున్న వారు సూచించాలని, అక్కడే చర్చిద్దామని ఆయన చెప్పారు. బిల్లుపై చర్చించేందుకు మరో 16 రోజుల సమయం మాత్రమే ఉందని, ఇప్పటికైనా చర్చించాలని జేపీ అన్నారు.
చర్చను ఇంకా అడ్డుకుంటే వారి వెనుకనున్న ఉద్దేశ్యాలను ప్రజల ముందుకు తీసుకువెళ్తామని ఆయన హెచ్చరించారు. ప్రజల హక్కులను అసెంబ్లీ గౌరవించాలని, అందుకు తగ్గట్టుగానే అందరూ నడుచుకోవాలని జేపీ సూచించారు. సభలో కంటే బీఏసీలో చర్చ ఎక్కువ జరుగుతోందని, అది మంచి సంప్రదాయం కాదని అన్నారు. తెలుగు ప్రజల మధ్య విభేదాలు రాకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీదా ఉందని జేపీ తెలిపారు.
ప్రజల మధ్య చిచ్చుపెట్టవద్దని నేతలకు సూచించారు. అలాగే గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో కేబినెట్ పని చేయట్లేదని, పూర్తిగా నిర్వీర్యమైపోయిందని ఆయన విమర్శించారు. అలా అంటే మంత్రులు ఒప్పుకోరు కానీ, వారు చేసిన ఓ గొప్పపని చెప్పండి అని ఆయన సవాలు విసిరారు. ఇంగిత జ్ఞానం ఉంటే సభలో చర్చకు సహకరించాలని ఆయన సభ్యులకు సూచించారు.