సోనియా తయారుచేసిన అనకొండే జగన్: చంద్రబాబు
2013 సంవత్సరం ఆడవారికి కష్టాలనే మిగిల్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మహిళల జీవితాల్లో వెలుగు రావాలని... రాబోయే కాలంలో మహిళలు కష్టపడకుండా చూసేందుకు తాను వచ్చానని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన మహిళా సదస్సులో పాల్గొన్న చంద్రబాబు మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. తమ హయాంలో నిర్మించిన హైటెక్ సిటీలో పురుషులకంటే మహిళలకే ఎక్కువ జీతాలు వస్తున్నాయని తెలిపారు. సోనియాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ అనకొండలు దేశాన్ని మింగేస్తున్నాయని ఆరోపించారు. 'సోనియా తయారుచేసిన అనకొండే జగన్' అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు.