బిల్లును కావాలనే జాప్యం చేస్తున్నారని రాష్ట్రపతితో చెప్పాం: హనుమంతరావు
మీరు పంపిన తెలంగాణ బిల్లును కావాలనే ప్రభుత్వం జాప్యం చేస్తోందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశామని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు చెప్పారు. రాష్ట్రపతితో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నేతలందరం కలిసి వినతి పత్రం ఇచ్చామని చెప్పారు. మంత్రి జానారెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, తాను రాష్ట్రపతితో మాట్లాడినట్లు చెప్పారు. తెలంగాణ అంశాన్ని మొదటి నుంచి అధ్యయనం చేస్తున్న వారిగా ఈ విషయంలో రాజ్యాంగానికి అనుగుణంగా ఈ ప్రాంతం వారికి న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. అశోక్ బాబు, కిరణ్ కుమార్ రెడ్డిలలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరనే సందేహాలు వస్తున్నాయని పేర్కొన్నారు.