సుఖ నిద్ర మన చేతుల్లో లేదు... పరుపే డిసైడ్ చేస్తుంది... గాఢ నిద్ర కోసం మంచి పరుపు ఏదో...?

మెదడు, శరీరానికి నిద్ర చాలా అవసరం. చక్కని ఆరోగ్యం, వ్యాధి నిరోధక శక్తి కోసం నిద్ర కావాలి మరి. పరుపు చక్కగా ఉంటే నిద్ర మంచిగా ఉంటుంది. ఎన్నో అధ్యయనాలు ఈ విషయాన్ని తేల్చాయి. వైద్యులు ధ్రువీకరించారు. అందుకే ఎటువంటి పరుపు అవసరం అన్నది ప్రతీ ఒక్కరూ తెలుసుకోవడం ఎంతో అవసరం.

కాయిర్ లేదా ఫోమ్

ఈ రెండింటిలో ముమ్మాటికి ఫోమ్ పరుపులే ఉత్తమమైన ఎంపిక. ఎందుకంటే కాయిర్ (కొబ్బరిపీచు)తో చేసిన పరుపు గట్టిగా ఉంటుంది. మన శరీర ఆకృతికి తగినట్టు మార్పులు జరగవు. దీంతో ప్రెషర్ పాయింట్లను ఏర్పాటు చేస్తుంది. అంటే కొన్ని శరీర భాగాలపై ఒత్తిడి పడుతుంది. దీంతో మంచి నిద్ర సాధ్యం కాదు. కొంత కాలం ఈ పరుపును వాడితే కుంగిపోతుంది. తిరిగి మామూలు స్థితికి రాదు.representative image కానీ, ఫోమ్ మ్యాట్రెస్ అలా కాదు. మరీ ముఖ్యంగా మెమరీ ఫోమ్ మరింత సౌకర్యాన్నిస్తుంది. పరుపు మన శరీర ఆకృతికి తగినట్టు మారిపోతుంది. మన శరీరం విడుదల చేసే ఒత్తిడిని ఫోమ్ పరుపులు తట్టుకోగలవు. శరీర ఉష్ణోగ్రతను కూడా తట్టుకోగలవు. మన శరీర వేడి వల్ల పరుపు లోపల ఫోమ్ మెత్తగా మారిపోతుంది. అన్ని పాలీ యురేతేన్ ఫోమ్ లలో ఇలా జరుగుతుంది. మెమరీ ఫోమ్ లలో మాత్రం ఇలా కాదు. ముందు మన శరీర బరువును సర్దుబాటు చేసుకుంటాయి. ఆ తర్వాతే వేడిని నిదానంగా గ్రహిస్తాయి. దీంతో పరుపు షేప్ తొందరగా మారిపోదు. నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత మంచి భావన ఉంటుంది.

చక్కని నిద్రకు, పరుపునకు మధ్య సంబంధం

కటిక నేల లేదా చాప లేదా మెత్తటి దుప్పటి... మన శరీరానికి సపోర్ట్ గా ఏది ఉందనేది నిద్రకు చాలా కీలకం. అదే నిద్ర నాణ్యతను నిర్ణయిస్తుంది. మనం రోజులో ఎంత లేదనుకున్నా... పగలు, రాత్రీ చూసుకుంటే 8 గంటలు నిద్రిస్తుంటాం. 24 గంటల్లో 8 గంటలంటే రోజులో మూడింట ఒకటో వంతు. మన జీవిత కాలంలో ఒక వంతు (33.3 శాతం) నిద్రకే ఖర్చవుతున్నప్పుడు ఆ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకోవాలి కదా? అందుకే పరుపు ఎప్పుడూ మృదువుగానే ఉండాలి. గట్టిగా ఉండకూడదు. చాలా గట్టిగా ఉందంటే అది అంత సౌకర్యంగా ఉండదు. నాణ్యమైన నిద్ర ద్వారానే శరీరం తిరిగి నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. విశ్రాంతి భావన కూడా అందుతుంది.

representative imageపరుపు మన శరీర పొడవు కంటే 20 సెంటీమీటర్ల ఎక్కువ పొడవు (సుమారు 8 అంగుళాలు) ఉండాలి. అలాగే ఇద్దరు నిద్రిస్తున్నట్టు అయితే 160 సెంటీ మీటర్ల (5 అడుగుల 2 అంగుళాలు) వెడల్పు ఉండాలి. ఒక్కరు నిద్రించేది అయితే పరుపు వెడల్పు కనీసం 90 సెంటీమీటర్లు (3 అడుగులు) అయినా ఉండాలి. పరుపుపై బరువు విడుదల అనేది ఒక్కో వ్యక్తిని బట్టి మారిపోతుంది. అందుకే మరొకరితో కలసి నిద్రిస్తున్నట్టు అయితే పరుపుపై రెండు రకాల ఒత్తిడులు పడతాయి. ఫోమ్ పరుపులు మెమొరీతో ఉన్నవి అయితే మృదువుగా ఉండడమే కాకుండా కంఫర్ట్ నిస్తాయి. బెడ్ సోర్స్ (పుండ్లు)కి అవకాశం ఉండదు. గాలి కూడా మంచిగా ఆడుతుంది.

స్ప్రింగ్ మ్యాట్రెస్
స్ప్రింగ్ మ్యాట్రెస్ శరీర ఉష్ణోగ్రతను సర్దుబాటు చేసుకోలేవు. దాంతో అంత సౌకర్యంగా అనిపించదు. సౌకర్యం కోసం కంపెనీలు స్ప్రింగ్ మ్యాట్రెస్ పైన ఫోమ్ లేయర్ వేసి తయారు చేస్తుంటాయి. కేవలం స్ప్రింగ్ పరుపే అయితే మనిషి శరీరాన్ని నిలబెడుతుంది. అంటే ఇతర పరుపుల్లా కుంగిపోదు. స్ప్రింగ్ మ్యాట్రెస్ శరీర బరువును కొన్ని పాయింట్ల వద్దే నిలబెడతాయి. అదే ఫోమ్ పరుపు అయితే శరీరానికి తగ్గట్టు మారిపోతుంది. శరీర బరువు అంతటా సమానంగా పడుతుంది. ఫోమ్ మ్యాట్రెస్ ను మడత పెట్టినా పాడవదు. కానీ, స్ప్రింగ్ మ్యాట్రెస్ ను మడత వేయడం అసాధ్యం. అలా అని అన్ని ఫోమ్ పరుపులు మంచివి అని అనలేము. నాసిరకం ఫోమ్ మ్యాట్రెస్ కంటే స్ప్రింగ్ మ్యాట్రెస్ నయం.

వెన్ను నొప్పి ఉంటే...?
వెన్ను నొప్పి వస్తుంటే అందుకు కారణాలు ఏంటో తెలుసుకోవాలి. పరుపు కారణంగానేనా లేక వైద్యపరమైన సమస్యల కారణమా...? అన్నది పరిశీలించుకోవాలి. పైగా వెన్ను నొప్పి అన్నది పడుకునే తీరును బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఒక పక్కకు తిరిగి పడుకునే వారికి మృదువుగా ఉండే పరుపులు తగినవి.  బోర్లా పడుకున్నా... వెల్లకిలా పడుకున్నా... గట్టి పరుపు కావాల్సి ఉంటుంది. దానివల్ల వెన్నెముకకు మంచి ఆసరా లభిస్తుంది. అలాగే, కీళ్ల నొప్పులు, ప్రెషర్ పాయింట్లతో సున్నితత్వం ఉన్నా... పరుపు ఉపరితలం చాలా మృదువుగా ఉండాలి.  కొన్ని రకాల ఫోమ్ మ్యాట్రెస్ ఉష్ణోగ్రతకు తగినట్టు మారిపోతుంటాయి.  

నిజానికి పడుకుని లేచిన తర్వాత వచ్చే వెన్నెముక నొప్పిని వెన్నెముక అమరిక తీరు నిర్ణయిస్తుంది. ఒకవేళ మ్యాట్రెస్ మరింత సాఫ్ట్ గా ఉంటే ప్రెషర్ పాయింట్లన్నింటికీ మద్దతు లభించదు. మరింత గట్టిగా ఉంటే ప్రెషర్ పాయింట్లపై ఒత్తిడిని పెంచుతుంది.  ఇలా నిద్ర సమయంలో వెన్నెముకపై ఒత్తిడి లేకుండా, సౌకర్యవంతమైన నిద్ర కోసం ఫోమ్, స్ప్రింగ్ మ్యాట్రెస్ ఉపయోగపడతాయంటారు. కాకపోతే ఎంత గట్టిదనం, ఎంత మృదుత్వం అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది.  

పడుకునే పరుపు మీకు అనువైనదేనా..?representative image

ఉదయం నిద్ర లేచిన తర్వాత వీపు కింది భాగంలో నొప్పి వస్తుంటే ఆ పరుపు ఎంత మాత్రం తగినది కాదు. పరుపుపై పడుకున్నప్పుడు భారంగా, అసౌకర్యంగా అనిపించకూడదు. పైగా గాల్లో తేలుతున్నట్టుంటే ఆ పరుపు సౌకర్యవంతమైనదని అర్థం. అందుకే కొనే ముందే స్టోర్ లో పరుపుపై ఓ 15 నిమిషాల పాటు పడుకుని చూడాలి.  

ఇన్నర్ స్ప్రింగ్ మ్యాట్రెస్
కాయిల్ స్ప్రింగ్ లతో చేసే పరుపు ఇది. పాతకాలం నాటి నుంచీ ఉన్నవే. నేటి అత్యాధునిక మ్యాట్రెస్ డిజైన్లకు మూలం ఇదే. ఓ ఐదు నుంచి ఏడేళ్ల కాలం పాటు పనిచేస్తాయి. పై భాగంలో మెత్తదనం కోసం లేటెక్స్ ఇతర ఫోమ్ లను ఉపయోగిస్తుంటారు. కాయిల్ కౌంట్ 390కి మించి ఉంటే ఆ పరుపులు అవసరం లేదన్నది నిపుణుల సూచన. 14 గేజ్ ఉన్నవాటిని అధిక నాణ్యతగలవి అని భావిస్తారు. ధర భరించగలిగిన స్థాయిలోనే ఉంటుంది. ఎక్కువగా అందుబాటులో ఉండే పరుపులు ఇవి. సగటున ప్రతీ ముగ్గురిలోనూ ఇద్దరు ఈ పరుపులతో సౌకర్యాన్ని పొందుతుంటారు. పరుపుపై ఒకరు కదులుతుంటే పక్కనున్న వేరొకరికి అసౌకర్యం ఉంటుంది.

మెమోరీ ఫోమ్representative image
మెమోరీ ఫోమ్ అంటే విస్కోస్ ఎలాస్టిక్ ఫోమ్. అధిక డెన్సిటీతో కూడిన పాలీ యురేతేన్ ఫోమ్ తో తయారు చేస్తారు. 1970లో నాసా ప్రాజెక్టులో భాగంగా రూపొందించబడినది. విమానాల్లో పైలట్లు, ప్రయాణికులకు మంచి కుషన్ తో కూడిన సీట్లు, కూలిపోయినప్పుడు రక్షణ కోసం దీన్ని తయారు చేసి చూశారు. ఇది విజయవంతం కావడంతో ఆ తర్వాత ఈ మెటీరియల్ తో పరుపులు, ఇతర వాణిజ్య ఉత్పత్తులను తయారు చేయడం కూడా ప్రారంభమైంది.

చూసి ట్రై చేయండి.
సండే మ్యాట్రెస్ పేరుతో ఫోమ్ మ్యాట్రెస్ లను విక్రయిస్తున్న ఓ సంస్థ వాటిని 100 రోజుల పాటు వాడుకుని చూసి నచ్చలేదంటే నగదు వాపసు చేస్తామని ప్రకటించింది. ఆసక్తి ఉంటే వీటిని వాడి చూసి నిర్ణయం తీసుకోవచ్చు.  
 
బరువు, ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు వీలుగా భిన్న సాంద్రతతో కూడిన ఫోమ్ ను ఉపయోగించి మెమోరీ ఫోమ్ పరుపులను తయారు చేస్తుంటారు.  శరీర ఉష్ణోగ్రతకు స్పందించడం ద్వారా పరుపు మన ఆకృతికి అనుగుణంగా మారిపోతుందన్న విషయం తెలిసిందే. బరువు ఒక్కచోట కాకుండా పరుపు అంతటికీ వ్యాపిస్తుంది. దాంతో ఒత్తిడి కలిగించే పాయింట్లు ఏర్పడవు. ఇటీవలి కాలంలో ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి. సౌకర్యవంతంగా ఉంటాయి. ఒకే పరుపుపై ఇద్దరు నిద్రించిన సమయాల్లో ఒకరు అటూ ఇటూ తిరగడం వల్ల వేరొకరికి అసౌకర్యం అనిపించదు. అలసట, కండరాల నొప్పితో బాధపడేవారికి మెమొరీ ఫోమ్ మంచిదని సూచిస్తున్నారు. ఓపెన్ సెల్ మెమోరీ ఫోమ్, జెల్ ఇన్ఫూస్డ్ మెమోరీ ఫోమ్, రెటిక్యులేటెడ్ ఫోమ్ ఇలా మెమోరీ ఫోమ్ లలోనూ రకాలు ఉన్నాయి. గాలి మంచిగా ప్రసరించేందుకు వీలుగా ఈ ప్రయోగాలు జరిగాయి. మెమోరీ ఫోమ్ బ్యాక్టీరియా, డస్ట్ మైట్స్, బెడ్ బగ్స్, అలెర్జెన్స్ కు వ్యతిరేకం.

అయితే, వీటి నుంచి కెమికల్స్ వాసన రావడం, రాత్రి వేళల్లో వేడిగా అనిపిస్తాయన్న ఫిర్యాదులు ఉన్నాయి. మెమోరీ ఫోమ్ అనేది పరుపు పైభాగంలో 2 నుంచి 8 అంగుళాల మేర ఉంటుంది. దీనికింద సపోర్ట్ గా బేస్ ఫోమ్ ఉంటుంది. ఇవి అధిక సాంద్రతతో ఉంటాయి. చదరపు అడుగుకు 1.8 నుంచి 2.4 కిలోల డెన్సిటీ ఉన్నవి మంచివి. ఇంతకంటే తక్కువ ఉంటే అవి దెబ్బతింటాయి. స్టాండర్డ్ మెమోరీ ఫోమ్ అయినందున సంప్రదాయ విస్కో ఫోమ్, ఉష్ణోగ్రతకు స్పందిస్తుంది. ఫోమ్ మ్యాట్రెస్ వల్ల సౌకర్యంగా ఉందని 80 శాతానికి పైగా కస్టమర్లు చెబుతుంటారు. వెన్ను నొప్పి, ఇతర నొప్పులు ఉన్నవారికి ఇవి అనువైనవంటున్నారు. ఇవి 10 నుంచి 20ఏళ్ల పాటు వరకూ చక్కగా మన్నుతాయి.

ఫోమ్ మ్యాట్రెస్representative image

పెట్రోకెమికల్ ఆధారిత పాలీ యురెతేన్ ఫోమ్ లేదా లేటెక్స్ రబ్బర్ ఫోమ్స్ ను ఫోమ్ మ్యాట్రెస్ గా చెబుతారు. పరుపుపై అంచువరకూ, మూలమూలనా సపోర్ట్, కంఫర్ట్ ఇచ్చేలా వీటిని తయారు చేస్తుంటారు. ఫోమ్ పరుపుల్లోనే మెమోరీ, జెల్ , లేటెక్స్, సాలిడ్ ఫోమ్ రకాలున్నాయి. పరుపు తయారీలో జెల్ ను ఉపయోగిస్తారు. దీనివల్ల సౌకర్యవంతమైన భావన, వేడిని బయటకు పంపడం జరుగుతాయి.

లేటెక్స్ మ్యాట్రెస్
సహజ లేదా సింథటిక్ రబ్బర్ తో లేటెక్స్ పరుపులు తయారవుతాయి. చాలా గట్టిగా ఉంటాయి. మంచి సపోర్టెడ్ గా ఉంటాయి. మెమోరీ ఫోమ్ మాదిరిగా కంఫర్ట్ కూడా లభిస్తుంది. పరుపు గట్టిగా ఉండొద్దని కోరుకునే వారికి ఇవి అనువైనవి కావు. వెన్ను నొప్పి వేధిస్తున్న వారికి ఈ పరుపులు అనువుగా ఉంటాయంటున్నారు. హెవియా బ్రాసిలెన్సిస్ చెట్ల నుంచి ఈ ఫోమ్ వస్తుంది. 1960ల్లో ఇది మార్కెట్లోకి వచ్చింది. అధిక ధర కారణంగా చాలా కాలం పాటు సంపన్నులకే పరిమితం అయింది. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కిన పుణ్యమా అని ధరలు దిగివచ్చాయి. లేటెక్స్ పరుపులు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. వేడిని తట్టుకోగలవు. తుంటి, భుజాలు, ఇతర చోట్ల పడుకున్నప్పుడు ఎక్కువగా ఒత్తిడి పడకుండా ఉంటుంది. దీంతో వెన్ను వంటి సున్నిత ప్రదేశాల్లో నొప్పుల బాధ ఉండదు. ఈ పరుపుపై ఇద్దరు నిద్రించిన సమయాల్లో ఒకరు కదలడం వల్ల మరొకరికి అసౌకర్యం కూడా ఉండదు.

సోఫా బెడ్లుrepresentative image
ఇంట్లో తక్కువ స్థలం ఉన్నవారికి సోఫా బెడ్లు అనువుగా ఉంటాయి. వాటిని సోఫాగానూ రాత్రి వేళ బెడ్ గానూ మార్చుకోవచ్చు. ఒకటి రెండు రాత్రులకు అయితే పర్వాలేదు. అంతకుమించి ఎక్కువ రోజులు పడుకోవడం ఎంతో నష్టానికి దారి తీస్తుందంటారు. స్ప్రింగ్ లు చాలా బలహీనంగా ఉండడం, వీటిని పల్చగా తయారు చేయడం ప్రతికూలతలు.
 
టాప్ టెన్ మ్యాట్రెస్ బ్రాండ్లు
దేశంలో ట్రాప్ టెన్ మ్యాట్రెస్ బ్రాండ్లను చూస్తే మొదటి స్థానంలో కర్లాన్ ఉంటుంది. ఈ సంస్థ ఫోమ్, స్ప్రింగ్, రబ్డరైజ్డ్ కాయిర్, థెరప్యూటిక్ పరుపు రకాలను తయారు చేస్తోంది. స్లీప్ వెల్ కూడా ప్రముఖ మ్యాట్రెస్ కంపెనీ. ఈ కంపెనీ సైతం అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరుపులను అందిస్తోంది. రబ్కో అనేది కేరళ స్టేట్ రబ్బర్ కోపరేటివ్ లిమిటెడ్ బ్రాండ్. ఏడు రకాల కాయిర్ మ్యాట్రెస్ లను ఈ సంస్థ అందిస్తోంది. అమెరికాకు చెందిన టెంపుర్ పెడిక్ మరో ప్రముఖ కంపెనీ. మెమొరీ ఫోమ్ తో ఈ కంపెనీ పరుపులను తయారు చేస్తోంది. ఒరిజినల్, క్లౌడ్, సెన్సేషన్ పేరుతో వివిధ మోడళ్లను విక్రయిస్తోంది. కాకపోతే ఇవి ఖరీదైనవి.

ఇక డన్ లాపిల్లో అనే కంపెనీ వ్యక్తుల శరీర ఆకృతులకు అనుగుణంగా పరుపులను తయారు చేస్తోంది. ప్రపంచానికి తొలిసారిగా 1931లో లేటెక్స్ మ్యాట్రెస్ ను పరిచయం చేసింది ఈ సంస్థే. నాలుగు రకాల పరుపును విక్రయిస్తోంది. ఎంఎం ఫోమ్ అనే కంపెనీ పిన్ కోర్ మ్యాట్రెస్, స్ప్రింగ్, డ్యుయల్ మాట్రెస్, కాయిర్ మ్యాట్రెస్ లను అందిస్తోంది. డ్యూరో ఫ్లెక్స్ రబ్బరైజ్డ్ కాయిర్, లగ్జరీ, స్ప్రింగ్, పఫ్ మ్యాట్రెస్ లను విక్రయిస్తోంది. టాప్ టెన్ లో మరో  కంపెనీ స్లీప్ జోన్. నాన్ స్ప్రింగ్, స్ప్రింగ్ పరుపులను తయారు చేస్తోంది. ఇళ్లు, హోటళ్ల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల మోడళ్లలో పరుపులను తయారు చేస్తోంది. దుబాయికి చెందిన కింగ్ కాయిల్, రెస్టోనిక్ సైతం టాప్ 10లో భాగం.


More Articles