సంగీత ప్రకటనను ఆవిష్కరించిన ఏషియన్ పెయింట్స్ 'డ్యాంప్ ప్రూఫ్' నీళ్లు కారే పైకప్పులపై రణబీర్ కపూర్, మనోజ్ పాహ్వాల ఉత్తేజకరమైన జుగల్-బందీ

Related image

June 15, 2023: మనం ఇప్పుడు వేసవి కాలంలో ఉన్నాం. రుతుపవనాలు రానున్నందున, వర్షాలు, పైకప్పు లీకేజీల కోసం ఇంటి యజమానులు తమను తాము సిద్ధం చేసుకోవాలి. దీనిని పరిగణనలోకి తీసుకుని, ఏషియన్ పెయింట్స్ బ్రాండ్ అంబాసిడర్ రణబీర్ కపూర్, బహుముఖ ప్రతిభావంతులైన మనోజ్ పహ్వాతో కూడిన ‘స్మార్ట్‌ కేర్ డ్యాంప్ ప్రూఫ్’ కోసం కొత్త ప్రచారాన్ని & TVCని ప్రారంభించింది. సీజనల్ తేమ. పైకప్పులు, టెర్రస్‌ల నుండి లీకేజీల సవాళ్లకు సమర్థవంతమైన పరిష్కారాన్ని, ఆకర్షణీయమైన, వినోద భరితమైన సంగీత ముఖాముఖి ని హైలైట్ చేస్తుంది.

 
“ఓగిల్వీచే” రూపొందించబడిన టీవీసీలో రణబీర్ కపూర్, మనోజ్ పహ్వా హాస్యభరితమైన ఖవ్వాలీ యుద్ధంలో పాల్గొంటారు. కారుతున్న పైకప్పు, తడిగా ఉన్న పైకప్పుల ఇంటి యజమాని దుస్థితి వద్దకు వారు వీక్షకులను తీసుకువెళతారు. పైకప్పు, టెర్రేస్ వాటర్‌ఫ్రూఫింగ్ కోసం గృహాల అంతిమ రక్షకుడిగా ‘ఏషియన్   పెయింట్స్ స్మార్ట్‌ కేర్ డ్యాంప్ ప్రూఫ్' యొక్క బలమైన శక్తిని ఈ టీవీసీ ప్రదర్శిస్తుంది.

 
లీకేజీ సమస్యలకు ఈ ప్రోడక్ట్ శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది, అంతిమంగా ఇంటి యజమానులకు ఒత్తిడి లేని జీవన అనుభవాన్ని అందిస్తుంది అనే సందేశాన్ని ఈ చిత్రం సమర్థవంతంగా అందజేస్తుంది. ట్రిపుల్ లేయర్ ఫ్లెక్స్ ఆర్మర్ ®టెక్నాలజీతో, ఈ ప్రోడక్ట్ అత్యుత్తమ క్రాక్ బ్రిడ్జింగ్ మరియు బలమైన సంశ్లేషణ ను నిర్ధారిస్తుంది మరియు దాని విశ్వసనీయతను నిరూపించడానికి 8 సంవత్సరాల వారంటీతో వస్తుంది.

 
కొత్త జాతీయ ప్రచారంపై ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ అమిత్ సింగల్ మాట్లాడుతూ, “దశాబ్దాలుగా, మా నిరంతర శ్రద్ధాసక్తుల ద్వారా, ఏషియన్ పెయింట్స్ ఇంటి యజమానులకు ఇంట్లో సౌకర్యవంతమైన మరియు ఒత్తిడి లేని జీవితాన్ని సృష్టించడానికి వినూత్న పరిష్కారాలను అందించింది. మా విలువైన కస్టమర్‌ల పట్ల మా అచంచలమైన నిబద్ధత కస్టమర్‌ల వివిధ అవసరాల కోసం మేం రూపొం దించే పరిష్కారాలలో ప్రతిబింబిస్తుంది. ‘ఏషియన్ పెయింట్స్ స్మార్ట్‌ కేర్ డ్యాంప్ ప్రూఫ్’ ఇంటి యజమా నులకు టెర్రస్‌ల నుండి లీకేజీ మరియు తేమ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారాన్ని అందిస్తుంది. మా తాజా ప్రచారంతో, లీకేజీలను సకాలంలో పరిష్కరించడం ప్రాముఖ్యతను నొక్కిచెప్పడానికి స్టార్ ఎంటర్‌టైనర్‌లు, రణబీర్ కపూర్, మనోజ్ పహ్వాల మధ్య ఖవ్వాలీ ముఖాముఖి ద్వారా వీక్షకుల దృష్టిని ఆకర్షించడం మా లక్ష్యం. రుతుపవనాలు తమ తలుపు తట్టకముందే కస్టమర్‌లు ఎంచుకోగల పరిష్కారాలను అందించడమే మా ప్రయత్నం’’ అని అన్నారు.

 
ఏషియన్‌ పెయింట్స్‌లిమిటెడ్ గురించి:

1942లో నెలకొల్పబడిన నాటి నుంచి₹ 29,101.28 కోట్ల(₹291 బిలియన్ల) టర్నోవర్‌తో భారతదేశ అతి పెద్ద మరియు ఆసియాలో రెండో  అతిపెద్ద పెయింట్‌ కంపెనీగా మారే వరకు కూడా ఏషియన్‌ పెయింట్స్‌ సుదీర్ఘ ప్రయాణం చేసింది. దీని ఏకీకృత టర్నోవర్ 29,101.28 కోట్లు. ఏషియన్‌ పెయింట్స్‌15 దేశాల్లో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 27 పెయింట్‌ తయారీ కేంద్రాలను కలిగి ఉంది. 60 దేశాల్లో ఇది వినియోగదారులకు తన సేవలను అందిస్తోంది. పెయింట్‌ పరిశ్రమలో ఏషియన్‌ పెయింట్స్‌ ఎప్పుడూ అగ్రగామిగా ఉంటోంది.  కలర్‌ ఐడియాస్‌, సేఫ్ పెయింటింగ్ సర్వీస్,  కలర్‌నెక్ట్స్‌, ఏషియన్ పెయింట్స్ బ్యూటిఫుల్ హోమ్స్ స్టోర్స్ లాంటి నూతన భావనలను భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఏషియన్ పెయింట్స్ డెకొరేటివ్ మరియు పారిశ్రామిక అవసరాల కోసం, ఇంటీరియర్ మరియు ఎక్స్­టీరియర్ వాల్స్ కోసం విస్తృత శ్రేణికి చెందిన పెయింట్స్­ను తయారు చేస్తోంది. దీని పోర్ట్ ఫోలియో  వాటర్ ప్రూఫింగ్ కోసం స్మార్ట్ కేర్, ఉడ్ ఫినిషెస్ కోసం ఉడ్­టెక్, మరియు అన్ని ఉపరితలాల కోసం అడ్హెసివ్స్ శ్రేణి లాంటివాటిని కలిగిఉంది. కంపెనీ హోమ్ ఇంప్రూవ్­మెంట్, డెకొర్ విభాగంలో తన ఉనికి కలిగిఉంది. బాత్, కిచెన్ ఉత్పాదనలను అందిస్తోంది. లైటింగ్, ఫర్నిషింగ్స్, ఫర్నీచర్­ను కూడా ఈ కంపెనీ తన పోర్ట్­ఫోలియోలో ప్రవేశ­పెట్టింది. సురక్షిత, పర్యవేక్షణతో కూడిన పెయింటింగ్, ఇంటీరియర్ డిజైన్ సేవలను కూడా అందిస్తోంది.

More Press Releases