"బట్టల రామస్వామి బయోపిక్కు" సినిమా ద్వారా తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో అల్తాఫ్ హసన్. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తూ "రాజిగాడు రాజయ్యాడు" అనే కొత్త చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను శర్మాస్ ఫిలింస్ బ్యానర్ పై బత్తుల పర్విన్, మనోజ్ అర్రోల, చిన్ని నిర్మిస్తున్నారు. "రాజిగాడు రాజయ్యాడు" మూవీలో అను శ్రీ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రముఖ కవి, గాయకుడు డా. గోరటి వెంకన్న కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ రోజు "రాజిగాడు రాజయ్యాడు" సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా ఉందో చూస్తే - ఒక గఢీ బయట ఒంటిపై గాయాలతో ఒక పంది పిల్లను చేతిలో పట్టుకుని కుర్చీలో హీరో కూర్చుని ఉండటం ఆసక్తి కలిగిస్తోంది. అలాగే చుట్టుపక్కల కుల వృత్తులకు సంబంధించిన పని ముట్లు ఉండటం ఆలోచన రేకెత్తిస్తుంది . ఆ పెద్ద గఢీ లోని వారికి హీరోకు ఉన్న సంబంధం ఏంటి ?, పంది పిల్లను ఆయన ఎందుకు చేతిలో పట్టుకుని ఉన్నారు ?, ఆయన ఒంటిపై గాయాలకు, గొడవలకు కారణం ఏంటి ? వంటి అంశాలతో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. సినిమా టైటిల్ లోనే మంచి నేటివిటీ కనిపిస్తోంది. రాజిగాడు ఎవరు ఎలా రాజయ్యాడు అనేది సినిమాలో చూడాల్సిందే.
నటీనటులు - అల్తాఫ్ హసన్, అను శ్రీ, డా. గోరటి వెంకన్న, గీతా అగర్వాల్, రాజేంద్ర మోహన్ నను, శ్రీవర్ధన్ త్రివేది, సుజాత దీక్షిత్, గోవర్ధన్ రెడ్డి, సంజయ్ గౌడ్, డా. శివకుమార్ కాముని, తదితరులు