'రమణి కల్యాణం' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ!
సూర్య వశిష్ఠ - దీప్సిక చంద్రన్ ప్రధానమైన పాత్రలను పోషించిన సినిమానే 'రమణి కల్యాణం'. విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా, మే 22వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ నెల 12వ తేదీ నుంచి 'ఈటీవీ విన్' లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
సంజన (దీప్సిక) చూపులేని అమ్మాయి. తల్లీదండ్రులను కోల్పోయిన ఆమె, బామ్మ దగ్గరే పెరుగుతుంది. అనాథలైన నలుగురు పిల్లలను దత్తత చేసుకుని వాళ్ల ఆలనా పాలనా చూస్తుంటుంది. ఒక వైపున పబ్ లో సింగర్ గా.. మరో వైపున ఒక ఎఫ్ ఎమ్ రేడియోలో ఆర్జేగా పనిచేస్తుంటుంది. తనకి చూపు లేకపోవడాన్ని ఒక లోపంగా భావించడం ఆమెకి ఎంతమాత్రం ఇష్టం ఉండదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతుంటుంది. అలాంటి సమయంలోనే ఆమెకి రాజ్ (సూర్య వసిష్ఠ) తారసపడతాడు.
రాజ్ మంచి కవి .. అతని రెండు కాళ్లూ పనిచేయవు.అందువలన అతను వీల్ ఛైర్ కి పరిమితమవుతాడు. అనాథగా మిగిలిపోయిన రాజ్ ను అతని స్నేహితులైన కిశోర్ - గీత (శ్రీనివాసరెడ్డి - శ్యామల) దంపతులు చూసుకుంటూ ఉంటారు. రెండు కాళ్లను కోల్పోయిన కారణంగా రాజ్ చాలా డీలాపడిపోతాడు. పోయింది నడక మాత్రమే తప్ప, భవిష్యత్తు కాదనే సంజన మాటలు అతనిలో కొత్త ఆశలను రేకెత్తిస్తాయి. వాళ్లిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది.
సంజనకి చూపులేని కారణంగా సంబంధాలు రావడమే కష్టమైపోతుంది. వచ్చిన సంబంధాలు ఆమె పెంచుతున్న పిల్లల కారణంగా వెళ్లిపోతుంటాయి. అలాంటి సమయంలో ఆమె రాజ్ ను ప్రేమించడం బామ్మకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఒంటరిగా మిగిలిపోయిన దగ్గర నుంచి కుమిలిపోతున్న రాజ్, సంజన రాకతో సంతోషంగా ఉండటం కిశోర్ దంపతులకు ఆనందాన్ని ఇస్తుంది. సంజన - రాజ్ పెళ్లి చేసుకుందామని అనుకుంటూ ఉండగా ఒక అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. అదేమిటి? అది వాళ్ల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? అనేది కథ.
చూపులేని అమ్మాయి .. కాళ్లు లేని అబ్బాయి. ఒకరు కవి అయితే .. మరొకరు గాయని. అలాంటి ఈ ఇద్దరి మధ్య నడిచే ప్రేమకథ ఇది. ఇద్దరూ ఆయా సందర్భాలలో తల్లిదండ్రులను కోల్పోయినవారే. అలాంటి ఆ ఇద్దరూ కలిసి నడవాలని అనుకుంటారు .. కలిసి బతకాలని నిర్ణయించుకుంటారు. సన్నిహితులంతా వాళ్ల నిర్ణయం పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తారు. అలాంటి ఆ సమయంలో ఏం జరిగిందనే ఒక అంశం చుట్టూ దర్శకుడు ఈ కథను నడిపించాడు.
ఫస్టాఫ్ అంతా హీరో - హీరోయిన్ పరిచయం, ఆ పరిచయం ప్రేమకి దారితీయడం వంటి సన్నివేశాలతో ఈ కథ ముందుకు వెళుతుంది. ఇద్దరి ఫ్లాష్ బ్యాకులు కూడా ఫస్టాఫ్ లోనే వచ్చేస్తాయి. ఈ సమయంలో వచ్చే బ్యాంగ్ తోనే ఇంటర్వెల్ కార్డు పడుతుంది. ఆ తరువాత నుంచి కథలో చోటుచేసుకునే సన్నివేశాలు ఎలా ఉండనున్నాయి? అనే ఒక ఆసక్తి ఆడియన్స్ లో మొదలవుతుంది. ప్రీ క్లైమాక్స్ తో వచ్చే ట్విస్ట్ తో ఈ కథను క్లైమాక్స్ దిశగా పరిగెత్తించారు.
చూపులేని హీరోయిన్ .. కాళ్లు లేని హీరో అనగానే, ఎంజాయ్ చేయలేని ప్రేక్షకులు అనే మాటనే ఆ తరువాత వినిపిస్తుంది. చూపులేని వాళ్లను హీరోయిన్ రోడ్డు దాటిస్తుంటే ఆడియన్స్ ముచ్చట పడతారు. కాళ్లు లేనివారికి హీరో సాయం చేస్తే శభాష్ అంటూ మెచ్చుకుంటారు. కానీ హీరోయిన్ కే చూపులేకపోతే, హీరోకే కాళ్లు లేకపోతే .. అనే ఆలోచనకు దృశ్య రూపమే ఈ సినిమా. అయ్యో పాపం ఇద్దరికీ ఇలా అయిందే అనుకుంటూ సర్దుకుపోదామని అనుకుంటే, ఆ ఇద్దరూ తమ తల్లిదండ్రులను వేరు వేరు సంఘటనలలో కోల్పోవడం తాలూకు ఫ్లాష్ బ్యాకులొచ్చి మీద పడతాయి. వాటి బరువు మోయలేక ఆడియన్స్ విలవిలలాడుతూ ఉండగానే, మరో ట్విస్ట్. తెరపై హీరో- హీరోయిన్ లను కోలుకోనీయలేదు .. ఆడియన్స్ ను తేరుకోనీయలేదు.
హీరో - హీరోయిన్స్ ను అలా చూడగానే ఆడియన్స్ వినోదం శూన్యమనుకునే కూర్చుంటారు. అయినా ఊహించుకోవచ్చుగదా అన్నట్టుగా పాటలు పెట్టారు. అవి కూడా అంతంత మాత్రమే. చూపులేని అమ్మాయిగా చేయడానికి హీరోయిన్ .. కాళ్లు లేనివాడిగా కనిపించడానికి హీరో చాలా కష్టపడ్డారని అనుకోవడం సహజం. కానీ నిజానికి అసలైన కష్టం ఆడియన్స్ దేనని చెప్పాలి. ఆ ఇద్దరినీ అలా చూస్తూ కూర్చోవడం అంత సామాన్యమైన విశేషమేం కాదు మరి.
అరవింద్ తిరుకోవేల ఫొటోగ్రఫీ .. రవితేజ గిరిజాల ఎడిటింగ్ .. సూరజ్ కురుప్ సంగీతం ఓ మాదిరిగా అనిపిస్తాయి.ఇలాంటి కథలు 1980లలో చాలానే వచ్చాయి. సెంటిమెంట్ .. ఎమోషన్స్ తాలూకు కంటెంట్ ను ప్రేక్షకులు ఆదరించిన రోజులవి. కానీ ఇప్పుడు ఈ తరహా కథలతో ఆడియన్స్ ను మెప్పించడం కష్టమనే చెప్పాలి. హీరో - హీరోయిన్స్ కి శారీరక లోపాలు కలిగించి, వాళ్ల ద్వారా అన్నివైపుల నుంచి పండే వినోదానికి తలుపులు మూసేయడమే ప్రధానమైన లోపం అని చెప్పాలి.
కొన్ని కథలు మాత్రమే పుస్తకం నుంచి తెరపైకి వస్తే బాగుంటాయి. కొన్ని కథలు పుస్తకానికి పరిమితమవుతేనే బాగుంటాయి. ఈ రెండో వర్గానికి చెందిన కథలను తెరపైకి తీసుకుని వస్తే ఎలా ఉంటుందనడానికి సమాధానమే ఈ సినిమా. రొటీన్ కంటెంట్ తో రావడం .. వినోదానికి దూరంగా వెళ్లడమే ఈ సినిమా నిరాశపరచడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవలసి ఉంటుంది.

Movie Details
Movie Name: Ramani Kalyanam
Release Date: 2026-06-12
Cast: Surya Vashishta, Deepsika Chandran, Srinivasa Reddy, Syamala,Tenali Sakunthala
Director: Vijay Adireddy
Producer: Kites Creatives
Music: Sooraj Kurup
Banner: Kites Creatives
Review By: Peddinti
Trailer