'మా బెహెన్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
మాధురీ దీక్షిత్ .. త్రిప్తి దిమ్రి .. ధర్నా దుర్గ ప్రధానమైన పాత్రలను పోషించిన సినిమానే 'మా బెహెన్'. సురేష్ త్రివేణి దర్శకత్వం వహించిన ఈ సినిమా, జూన్ 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు ఇతర భాషల్లోను అందుబాటులోకి వచ్చింది. క్రైమ్ కామెడీ జోనర్లో రూపొందిన ఈ సినిమా, ఏ స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకుందనేది ఇప్పుడు చూద్దాం.
రేఖ (మాధురీ దీక్షిత్) రైల్వేస్ లో పనిచేసే సుకుమార్ ను పెళ్లి చేసుకుంటుంది. రేఖ చాలా అందంగా ఉంటుంది .. మోడ్రన్ గా .. ఆకర్షణీయంగా కనిపించడానికి ఇష్టపడుతుంది. అయితే అత్తింటివారికి ఇది అంతగా ఇష్టం ఉండదు. అలాంటి పరిస్థితులలోనే సుకుమార్ .. అతని తల్లి ఇద్దరూ కరెంట్ షాక్ తో చనిపోతారు. అప్పటికి వారికి జయ (త్రిప్తి దిమ్రి) కలుగుతుంది. ఆ తరువాత ఆమె జీవితంలోకి వచ్చిన ఒక వ్యక్తి ద్వారా 'సుష్మ' ( ధర్నా దుర్గ) కలుగుతుంది.
రేఖ ఇంటికి సమీపంలో గుప్తా (రవికిశోర్) ఉంటాడు. భార్య .. ఇద్దరు పిల్లలు ఉన్న గుప్తా, రేఖాపై మనసు పారేసుకుంటాడు. రేఖ భర్త సుకుమార్ హన ఇంటిని గుప్తా దగ్గరే తాకట్టు పెడతాడు. అయినా అతను రేఖ పట్ల గల ఆకర్షణ కారణంగా ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడు. అయితే 'ఆదర్శ్ నగర్ 'కాలనీలో, గుప్తా భార్యతో సహా మిగతా వాళ్లంతా రేఖ పట్ల అసూయతో ఉంటారు. ఆమెను ఆ కాలనీ నుంచి పంపించాలనే ఆలోచన చేస్తుంటారు.
రేఖ పెద్ద కూతురు జయ, మానస్ ను పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది. రీల్స్ పిచ్చి ఎక్కువగా ఉన్న సుష్మ, అక్క దగ్గర ఉండలేక వేరుగా వెళ్లిపోతుంది. ఒంటరిగా పాట్నాలో ఉంటున్న రేఖ, ఒక రోజు అర్థరాత్రి వేళ కాల్ చేస్తుంది. తన ఇంట్లో .. తన కారణంగా గుప్తా చనిపోయాడని చెబుతుంది. తనకి భయంగా ఉందని ఆమె ఏడవడంతో వెంటనే వాళ్లు తల్లి దగ్గరికి చేరుకుంటారు. జరిగిన సంఘటన గురించి రేఖ వాళ్లకి వివరిస్తుంది.
గుప్తా కూతురు పెళ్లికి సంబంధించిన వేడుక జరుగుతుందనీ, ఆ హడావిడిలో వాళ్లు ఉండగానే, అతని శవాన్ని తాము మాయం చేయాలని ఆమె తన కూతుళ్లతో చెబుతుంది. తమ తండ్రులను కూడా రేఖనే చంపిందనే ఒక అనుమానం వారికి ఉంటుంది. గుప్తా బావమరిది మహేశ్వర్ ఒక పోలీస్ ఆఫీసర్. తన భర్త కనిపించకుండా పోవడానికి కారణం రేఖనే అంటూ గుప్తా భార్య, తన తమ్ముడు దగ్గర అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? రేఖ విషయంలో ప్రచారంలో ఉన్న విషయాలన్నీ నిజమేనా? అనేది మిగతా కథ.
'మా బెహెన్' అంటే మా తల్లి .. సోదరి అని అర్థం. అంటే ఈ సినిమాలో ప్రధానమైన తన తల్లి .. అక్కయ్య గురించి మూడో పాత్ర అయిన సుష్మ చెబుతున్నట్టుగా అనుకోవలసి ఉంటుంది. ఆమె వైపు నుంచి ఈ టైటిల్ ను సెట్ చేశారని భావించాలి. రెండు కుటుంబాల చుట్టూ .. మూడు ప్రధానమైన పాత్రల చుట్టూ దర్శకుడు అల్లుకున్న ఆసక్తికరమైన కథ ఇది.
పాతికేళ్ల వయుస్సులోనే భర్తను కోల్పోయిన రేఖ .. ఆమె కంట్లోపడితే చాలని భావించే కుర్రాళ్లు .. ఆమెను వెళ్లగొట్టకపోతే తమ భర్తలను వలలో వేసుకుంటుందని అసూయపడే లేడీస్ .. తమ తండ్రి చనిపోవడానికి తల్లియే కారణమని అనుమానించే కూతుళ్లు .. ఇలా విభిన్నమైన స్వభావం కలిగిన పాత్రల చుట్టూ ఈ కథను అల్లుకుంటూ వెళ్లారు. సాధ్యమైనంత వరకూ కామెడీ టచ్ ఇస్తూ వెళ్లారు. అయితే ఈ కామెడీ ఆశించిన స్థాయిలో నవ్వించలేకపోతుంది.
మాధురీ దీక్షిత్ తో ప్రధానమైన రేఖ పాత్రను చేయించారు. ఆ పాత్రను గురించి ఆడియన్స్ ఒక రేంజ్ లో ఊహించుకుంటారు. అయితే ఆశించిన స్థాయిలో ఆ పాత్రను డిజైన్ చేయలేదనే అనిపిస్తుంది. అందంగా కనిపించడానికి ఆరాటపడటం .. ఆకర్షించడానికి ప్రయత్నించడం అనే ఆ పాత్ర లక్షణాలు కామెడీ వైపు నుంచి మాత్రమే కనిపిస్తాయి. ఈ పాత్ర ద్వారా దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడనేది మనకి అర్థం కాదు. ఆమె కూతళ్ల పాత్రల పరిస్థితి కూడా అంతే.
అనుకోకుండా హత్య చేసేసి .. ఆ శవాన్ని మాయం చేయడానికి ప్రయత్నించే కంటెంట్ తో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఆ రూట్ లో కొంత దూరం వెళ్లిన ఈ సినిమా, మధ్యలో మరో టర్న్ తీసుకుంటుంది. ఇదే కొత్తదనం అనుకుని ఉండొచ్చు. కానీ కామెడీని అందించే అవకాశం ఇక్కడే చేజారిపోయినట్టుగా అనిపిస్తుంది. తల్లీ కూతుళ్లు .. రవికిషన్ పాత్రలు మినహా, ఆ తరువాత వచ్చే ప్రతి పాత్ర బలహీనమైనది కావడం మరో మైనస్.
రేఖను అనుమానించే వైపు నుంచి గుప్తా భార్య పాత్రను .. రేఖ ఫ్యామిలీని అనుమానిస్తూ మహేశ్వర్ కొనసాగించే ఇన్వెస్టిగేషన్ వైపు నుంచి ఇంట్రెస్టింగ్ సీన్స్ రాసుకోవచ్చు. అలాగే మానస్ పాత్రలోని శాడిజాన్ని హైలైట్ చేసుకునే అవకాశం ఉంది. పరేశ్ రావెల్ వంటి ఆర్టిస్ట్ ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం అసంతృప్తిని కలిగించే మరో విషయం.
మాధురీ దీక్షిత్ .. త్రిప్తి దిమ్రీ ఇమేజ్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణ అని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. కానీ కథగా చూసుకుంటే, ఇంతకుముందు కాస్త అటు ఇటుగా ఇదే కథతో వచ్చిన సినిమాల కంటే ఇది భిన్నమైనదేం కాదు. కామెడీ వైపు నుంచి రాసుకున్న ఈ కథా కథనాలు ఆశించిన స్థాయిలో అలరించలేక పోయాయనే చెప్పాలి.
ఆర్టిస్టులంతా మంచి అనుభవం కలిగినవారే కావడంవలన, చాలా బాగా చేశారు. అనూజ్ రాకేశ్ ఫొటోగ్రఫీ .. ఆకాశ్ దీప్ నేపథ్య సంగీతం .. దీపిక కైరా ఎడిటింగ్ ఫరవాలేదు. స్టార్ ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులు నటించిన ఒక సాధారణమైన కంటెంట్ గానే ఇది కనిపిస్తుంది. అంతకుమించి ఎలాంటి వైవిధ్యం లేనిదిగానే చెప్పుకోవలసి ఉంటుంది.

Movie Details
Movie Name: Maa Behen
Release Date: 2026-06-04
Cast: Madhuri Dixit,Triptii Dimri, Dharna Durga,Ravi Kishan ,Geetanjali Kulkarni ,Paresh Rawal
Director: Suresh Triveni
Producer: Vikram Malhotra
Music: Akashdeep Sengupta
Banner: Abundantia Entertainment
Review By: Peddinti
Trailer