'డెర్బీ' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
కాలేజ్ నేపథ్యంలోని కథలు యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. క్యాంపస్ కథలతో వచ్చిన చాలా సినిమాలు విజయాలను సాధించాయి. అలాంటి ఒక నేపథ్యంలో వచ్చిన సినిమానే 'డెర్బీ'. మార్చి 27వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ నెల 15వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగులోను ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది.
అర్జున్ .. సందీప్ .. ష్వాన్ .. ఉస్తాద్ .. యూసఫ్ .. మరియా స్నేహితులుగా ఉంటారు. అందరూ కూడా ఒకే కాలేజ్ లో చేరతారు. అర్జున్ తల్లి విదేశాలలో ఉంటుంది. అందువలన అర్జున్ కి సంబంధించిన అన్ని విషయాలను తండ్రి దినకరన్ చూసుకుంటూ ఉంటాడు. ఇక యూసఫ్ విషయానికి వస్తే, తండ్రి లేని యూసఫ్ ను ఫారిన్ లో ఉంటున్న మేనమామ దగ్గరికి పంపించాలనే ఉద్దేశంతో తల్లి ఉంటుంది. ఇక మిగతా స్నేహితులంతా కూడా మధ్యతరగతి నుంచి వచ్చినవారే.
కాలేజ్ లైఫ్ ను కలర్ఫుల్ గా గడపొచ్చు .. ఎంజాయ్ చేయవచ్చని భావించిన అర్జున్ టీమ్ కి, తొలిరోజునే నిరాశ ఎదురవుతుంది. కాలేజ్ లో థర్డ్ ఇయర్ గ్యాంగ్ కి లీడర్ గా 'రియాజ్' ఉంటాడు. సెకండియర్ గ్యాంగ్ కి 'అమల్' నాయకుడిగా ఉంటాడు. ఈ రెండు గ్రూపుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఫ్రెషర్స్ గా వచ్చిన అర్జున్ బ్యాచ్ వాళ్లు సీనియర్స్ ను చూసి కంగారు పడిపోతారు. కాలేజ్ లో తాము అనుకున్నట్టుగా రోజులు గడవడం కష్టమేనని వాళ్లకి అర్థమైపోతుంది.
ఫస్టు ఇయర్ వాళ్లను సీనియర్స్ ప్రతి విషయంలో ఎవైడ్ చేస్తుంటారు. క్లాస్ రూమ్స్ .. క్యాంపస్ .. క్యాంటీన్ .. ప్లే గ్రౌండ్ .. ఇలా అన్ని చోట్లా ఫస్టు ఇయర్ వాళ్లను అవమానించడమే పనిగా పెట్టుకుంటారు. సీనియర్ అయిన శ్రేయతో అర్జున్ చనువుగా ఉండటం, వాళ్ల ఆగ్రహానికి మరింత కారణమవుతుంది. అప్పుడు అమల్ గ్యాంగ్ ఏం చేస్తుంది? వాళ్లను అర్జున్ టీమ్ ఎలా ఎదుర్కొంటుంది? కాలేజ్ క్యాంపస్ వాళ్ల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? అనేది కథ.
కాలేజ్ లో తమ పిల్లలు బాగా చదువుకోవాలనీ, కాలేజ్ నుంచి బయటికి రాగానే మంచి జాబ్ సంపాదించి లైఫ్ లో సెటిల్ కావాలని పేరెంట్స్ ఆశపడుతూ ఉంటారు. కాలేజ్ లో ఎలాంటి గొడవలు లేకుండా తమ పిల్లలు బయటపడాలని భావిస్తూ ఉంటారు. అయితే అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో చదువుకోవడానికి వచ్చిన స్టూడెంట్స్ మధ్య ఇక్కడ ఎలాంటి వార్ నడుస్తూ ఉంటుందనే అంశం చుట్టూ ఈ కథను అల్లుకున్నారు.
కాలేజ్ లలో సీనియర్స్ .. జూనియర్స్ మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి. ర్యాగింగ్ అనేది వాళ్లను ఎలా విడదీస్తుంది. సీనియర్స్ ను యాజమాన్యం ఎందుకు నియంత్రించలేకపోతోంది అనే విషయాలను టచ్ చేస్తూ దర్శకుడు ఈ కథను ముందుకు తీసుకుని వెళ్లాడు. ఆవేశాల కారణంగా స్టూడెంట్స్ భవిష్యత్తు ఎలా ప్రశ్నార్థకంగా మారుతుందనేది ఆవిష్కరించడానికి ప్రయత్నించారు. అలాగే స్టూడెంట్స్ కుటుంబాల వైపు నుంచి ఎమోషన్స్ ను కనెక్ట్ చేయడానికి ట్రై చేయడం కనిపిస్తుంది.
కాలేజ్ వాతావరణం ఎలా ఉంటుంది .. ఆ క్యాంపస్ లోకి అడుగుపెట్టిన తరువాత స్టూడెంట్స్ ప్రవర్తన ఎలా ఉంటుందనేది సహజంగా ఆవిష్కరించడంలో దర్శకుడు కొంతవరకూ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. లవ్ .. ఫ్రెండ్షిప్ .. కామెడీ .. ఫ్యామిలీ ఎమోషన్స్ లో, కేవలం ఫ్రెండ్షిప్ ను మాత్రమే కాస్త హైలైట్ చేయడం కనిపిస్తుంది. మిగతా అంశాలు అంతగా ప్రభావితం చేయకపోవడం నిరాశను కలిగిస్తుంది.
కాలేజ్ కథల్లో లవ్ .. రొమాన్స్ అనే అంశాలాను టచ్ చేయకుండా వదలరు. యూత్ లో ఎక్కువగా ఆ అంశాలపై ఫోకస్ చేస్తూనే థియేటర్స్ కి వస్తారు. అయితే ఈ సినిమా విషయంలో ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం జరగలేదు. స్టూడెంట్స్ గొడవలు .. కొట్లాటలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. ఆ గొడవల వెనుక బలమైన ఎమోషన్ లేకపోవడం మరో మైనస్ గా అనిపిస్తుంది.
కథ ఒక ఫ్లోలో పరిగెత్తకుండా ఎటెటో వెళుతుంది. అనవసరమైన సన్నివేశాల దిశగా మలుపులు తీసుకుంటుంది. కాలేజ్ క్యాంపస్ లోకి వెహికల్స్ ను అనుమతించమని అంటే, హెలికాఫ్టర్ లో రావడం వంటి సన్నివేశాలు కాస్త అతిగా అనిపిస్తాయి. అమల్ గ్యాంగ్ అరాచకం చాలదన్నట్టుగా, హకీమ్ గ్యాంగ్ ను రంగంలోకి దింపడం కూడా అలాంటిదే.
స్టూడెంట్స్ గా చేసిన వాళ్లంతా బాగానే చేశారు. కాకపోతే ఎమోషన్స్ వైపు నుంచి వాళ్ల పాత్రలను ఎక్కువగా డిజైన్ చేయకపోవడం నిరాశను కలిగిస్తుంది. కథాకథనాలు కొత్తగా .. గొప్పగా అనిపించవు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం . ఎడిటింగ్ ఓ మాదిరిగా ఉన్నాయంతే. యూత్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన కంటెంట్ అయినప్పటికీ, యూత్ ను ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి.

Movie Details
Movie Name: Derby
Release Date: 2026-05-15
Cast: John Antony, Franco Francis,Santhosh, Suparna, Predeep Balan,
Director: Sajil Mampad
Producer: Manzour Abdul Rasac - Deema manzour
Music: Gopi Sundar
Banner: Demanz Film Factory
Review By: Peddinti
Trailer