'అన్ దేఖి' (సోనీ లివ్) సిరీస్ రివ్యూ!
హిందీలో రూపొందిన భారీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లలో 'అన్ దేఖి' ఒకటోగా చెప్పుకోవచ్చు. ఈ సిరీస్ నుంచి ఇంతవరకూ 4 సీజన్లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 2020 మొదలు 2024 వరకూ మూడు సీజన్లు ఆడియన్స్ ను అలరించాయి. మే 1వ తేదీ నుంచి హిందీతో పాటు ఇతర భాషలలో 4వ సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
'మనాలి'లోని రిసార్టులో జరిగిన కాల్పులలో 'రింకూ' భార్య ముస్కాన్ చనిపోతుంది. పాపాజీ కారణంగానే ఆమె చనిపోయిందని అంతా భావిస్తారు. కోడలిని హత్య చేసిన మామగారిగా అతని గురించి మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడతాయి. పాపాజీకి రింకూ పెంపుడు కొడుకు. పాపాజీ చేసే కార్యకలాపాలకు అతనే ప్రధానమైన ఆయుధం. అతను కూడా తన భార్యను పాపాజీనే షూట్ చేశాడని నమ్ముతాడు.
ఈ కేసు విషయంగా జైల్లో ఐదేళ్లుగా పాపాజీ శిక్షను అనుభవిస్తూ ఉంటాడు. జరిగిన హత్యకి తాను కారకుడిని కాదనీ, తన తమ్ముడైన 'మహి' అని అతను చెబుతూనే ఉంటాడు. కానీ ఎవరూ పట్టించుకోరు. పాపాజీ జైల్లో మగ్గుతూ ఉండగానే, రింకూ నాయకత్వంలో వాళ్ల కార్యకలాపాలు మరింత ముందుకు దూసుకుని వెళుతూనే ఉంటాయి. పాపాజీ తమ్ముడైన 'మహి' ముగ్గురు కొడుకులకు ఇది అంతగా నచ్చదు.
జోగీ దిలాన్ .. సుఖ్ దిలాన్ .. బాబీ దిలాన్ ఈ ముగ్గురూ కూడా, తండ్రి ప్రోత్సాహంతోనే రాంగ్ రూట్లో వెళుతుంటారు. ఈ ముగ్గురికీ కూడా రింకూతో పేచీ నడుస్తూనే ఉంటుంది. రిసార్ట్ లో జరిగిన కాల్పుల విషయంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న 'కవిత' కనిపించకుండా పోవడంతో, సరైన ఆధారాలు లేని కారణంగా జైలు నుంచి పాపాజీ రిలీజ్ అవుతాడు. కవిత ఏమైపోయిందో తెలుసుకోవడం కోసం అతను తన కొడుకైన దమన్ ను పంపిస్తాడు.
ఇక మరొక వైపున చండీఘర్ పరిసర ప్రాంతాలకు చెందిన పేద అమ్మాయిలు కనిపించకుండా పోతుంటారు. ప్రీతి అనే ఒక అమ్మాయి కేసుతో ఈ రాకెట్ ను ఛేదించడానికి పోలీస్ ఆఫీసర్ 'రాశి' రంగంలోకి దిగుతుంది. ఈ విషయంలో ఆమె ఎస్పీ వరుణ్ ఘోష్ సాయం తీసుకుంటుంది. ఈ రాకెట్ వెనకున్నదెవరు? రిసార్టులో ముస్కాన్ మరణానికి కారకులు ఎవరు? ఈ కేసులో సాక్షిగా ఉన్న కవిత ఆచూకీని దమన్ తెలుసుకోగలుగుతాడా? అనేది మిగతా కథ.
అన్నదమ్ములకు సంబంధించిన రెండు సంపన్న కుటుంబాలు .. ఆ రెండు కుటుంబాలకు చెందిన వారసులు .. పగలు .. ప్రతీకారాలు .. నియంతృత్వ వైఖరి చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఒకరిపై ఒకరు పై చేయి సాధించడానికి చేసే ప్రయత్నాలు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒక వైపున తన భార్య మరణానికి కారకుడైన తన పెంపుడు తండ్రిపై కోపంతో రగిలిపోతూనే, మరోవైపున శత్రువుల పాలిట నిర్దయగా ప్రవర్తించే రింకూ పాత్రనే ఈ కథకు ప్రధానమైన కేంద్ర బిందువు.
మరో వైపున రింకూకి చేరువ కావడానికి దీపిక ప్రయత్నించడం .. తన భార్య స్థానంలోకి దీపికను రానీయడానికి రింకూ అంగీకరించకపోవడం .. రింకూ శత్రువులు ఆమె కదలికలపై నిఘా పెట్టడం .. చండీఘర్ లో అదృశ్యమైపోయిన ప్రీతి కేసు, దాని వెనకున్న అమ్మాయిల అక్రమ రవాణా రాకెట్ వంటి అంశాలు ఈ కథపై ఆసక్తిని రేకెత్తిస్తూ ముందుకువెళతాయి.
ముస్కాన్ చనిపోవడానికి కారకులు ఎవరు? ప్రత్యక్ష సాక్షిగా ఉన్న కవిత ఏమైపోయింది? అమ్మాయిల రాకెట్ వెనకున్న అదృశ్య వ్యక్తులు ఎవరు? అనే మూడు ప్రధానమైన అంశాలను కలుపుకుంటూ ఈ కథ వెళుతుంది. రింకూ అతని తమ్ముడు దమన్ పాత్రలను, వాళ్ల ముగ్గురు కజిన్స్ పాత్రలను డిజైన్ చేసిన తీరు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే సైమన్ .. డీజే .. లక్కీ పాత్రలు కూడా ప్రేక్షకులను కొంతవరకూ ప్రభావితం చేస్తూ వెళతాయి.
కథ బలంగా ఉండటం వలన .. స్క్రీన్ ప్లే కూడా అంతే పట్టుగా సాగుతూ వెళ్లడం కనిపిస్తుంది. పాత్రలను .. యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఆర్టిస్టులంతా కూడా తమ పాత్రలకు న్యాయం చేస్తూ వెళ్లారు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ వర్క్ చాలా నీట్ గా అనిపిస్తాయి. నిర్మాణ విలువ పరంగా మరిన్ని మార్కులు దక్కించుకునే సిరీస్ ఇది.
డబ్బు .. అనుచరులు .. ఆయుధాలు ఉన్న వ్యక్తులు వ్యవస్థలను ఎలా తయారు చేస్తారు? తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తారు? అనే విషయాన్ని ఆవిష్కరించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అయితే ఈ సిరీస్ ను ఫ్యామిలీతో కలిసి చూడలేము. అభ్యంతరకరమైన సన్నివేశాలు .. సంభాషణలు ఉన్నాయి. కాస్త కంగారు పెట్టే రక్తపాతం కూడా లేకపోలేదు.

Movie Details
Movie Name: Un Dekhi
Release Date: 2026-05-12
Cast: Surya Sharma, Harsh Chhaya, Dibyendu Bhattacharya, Varun Badola, Ankoor Rathee
Director: Ashish Shukla
Producer: Sameer Nair - Deepak Segal
Music: -
Banner: Applause Entertainments
Review By: Peddinti
Trailer