'జెట్‌లీ' మూవీ రివ్యూ
కమెడియన్‌గా మంచి గుర్తింపు సాధించిన సత్య ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం 'జెట్‌లీ', 'మత్తు వదలరా' సిరీస్ చిత్రాలతో సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రితేష్ రానా ఈ చిత్రానికి దర్శకుడు. ఇక ఈ జెట్‌లీ కథేంటి? ఈ చిత్రంలో ప్రేక్షకులను అలరించే అంశాలున్నాయా? లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
బ్యాంక్ స్కామ్‌తో ప్రజలను మోసం చేసిన ప్రజాపతి (అజయ్) అనే వ్యాపారవేత్త దేశం వదిలి పారిపోతాడు. అయితే మంత్రి మెల్కోటి (శ్రీనివాస్ వడ్లమూని) అతన్ని తిరిగి దేశానికి రప్పించే బాధ్యతను ఇంటెలిజెన్స్ శాఖకు అప్పగిస్తాడు. అయితే అప్పటికే తనకు ఇతర వ్యక్తులతో ప్రాణహాని ఉందని తెలుసుకున్న ప్రజాపతి స్వయంగా లొంగిపోయినట్లు నటించి, ఆ తరువాత తను తప్పించుకోవాలని ప్రణాళిక రచిస్తాడు. ఇక అతన్ని దుబాయ్ నుంచి కొచ్చికి ఓ విమానంలో తీసుకొస్తుండగా, ప్రజాపతిని చంపడానికి ప్రయత్నిస్తారు. అప్పటికే ఈ విమానంలోకి మతిస్థిమితం లేని వ్యక్తిగా ప్రయాణిస్తున్న డాక్టర్ వేదవ్యాస్ (సత్య) ఏం చేశాడు? ప్రజాపతిని వేదవ్యాస్ ఎలా కాపాడాడు? విమానంలో ఎదురైన భయానక పరిస్థితులు ఏమిటి? విమానం సేఫ్‌గా కొచ్చిలో ల్యాండ్ అయ్యిందా? ఈ కథకు వెన్నల కిషోర్‌కు సంబంధమేమిటి? ఏజంట్ శివానీ (రియాసింగ్) ఎవరు? అనేది మిగతా కథ
థ్రిల్లర్ కథాంశానికి కామెడీని జోడించి సినిమా చేయాలి అనే కాన్సెప్ట్‌తో దర్శకుడు రితేష్ రానా అసలు కథలో ఏ మాత్రం కొత్తదనం, కథాంశంలో బలం లేని లైన్‌తో, విసుగు పుట్టించే కామెడీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. 'మత్తు వదలరా', మత్తు వదలరా-2 చిత్రాల తరహాలోనే తన స్టయిల్‌లో కామెడీ పండించాలని రితేష్ చేసిన ఈ ప్రయత్నం విఫలమైంది. ఈ సినిమా కథ అంతా ఓ విమానంలోనే కొనసాగుతుంది. విమానంలో కథకు కావాల్సిన పాత్రలన్నీ ఎక్కించేశాడు. కానీ ఏ పాత్ర అర్థవంతంగా ఉండదు. అర్థం కాదు. తన తోచిన విధంగా పూర్తి కన్వీనెంట్ రైటింగ్‌తో ఈ చిత్ర స్క్రీన్‌ప్లేను రాసుకున్నాడు.
సాధారణంగా బ్యాంకింగ్ స్కామ్‌కి సంబంధించిన కథలో ఉత్సుకత ఉంటుంది. తదుపరి సన్నివేశం గురించి అందరిలో ఆసక్తి ఉంటుంది. ఈ సినిమాలో ఇలాంటి ఉత్సుకత మచ్చుకు కూడా కనిపించదు. సినిమా ఆద్యంతం స్పూఫ్‌లు, సోషల్ మీడియా వన లైనర్స్‌తోనే నింపేశాడు. సినిమా మొత్తం గందరగోళంగా, తెరపై ఎదో జరుగుతోంది అని కంగారు తప్ప కాసింత కూడా ఊరట కూడా కలగదు. కథ ప్రారంభంలోనే ఫ్లైట్‌తో మొదలుపెట్టి, కథను, ఫ్లైట్‌ను అక్కడక్కడే తిప్పుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఏ మాత్రం లాజిక్‌లు పట్టించుకోకుండా కథను, స్క్రీన్‌ప్లేను దర్శకుడు అల్లుకున్నాడు. ప్రతి సన్నివేశంలో కామెడీ పండించాలనే ప్రయత్నం మాత్రం కనిపించింది. కానీ కామెడీ మాత్రం లేదు.
సినిమా చూస్తున్న ఆడియన్స్‌కు ఓ హైజాక్ ఫ్లైట్‌ను ఎక్కిన ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్ కాసిన్ని వన్‌లైనర్స్ పంచ్‌లతో సరదాగా సాగినట్లుగా అనిపించినా, సెకండాఫ్ ఓపికకు పరీక్ష పెడుతుంది. ఈ సినిమా పతాక సన్నివేశం ఎప్పుడొస్తుంది? ఎప్పుడూ థియేటర్ నుంచి వెళ్లిపోదామా అనే ఫీలింగ్ వచ్చేలా సినిమా ఆద్యంతం ప్రేక్షకులకు విసుగొచ్చేలా ఉంటుంది. కాసింగ గందరగోళంగా క్లైమాక్స్‌లో ఫ్లయిట్ ల్యాండ్ అవ్వగానే.. అందులోని ప్రయాణికులా తరహాలోనే థియేటర్‌లో ప్రేక్షకులు కూడా.. సినిమా అయిపోయింది అనే ఆనందంతో ఊపిరి పీల్చుకున్నారు.
దర్శకుడు రితేష్ రానా తనొక అద్భుతమైన హిలేరియస్ ఎంటర్‌టైనర్ తెరకెక్కిస్తున్నాననే ఫీలింగ్‌లో సినిమాలపై వ్యక్తులపై వన్‌లైనర్ పంచ్‌లు రాసుకున్నాడు. ఈసినిమాలో ఓ సన్నివేశంలో అందరూ ఇక్కడి నుంచి మూవ్ అనగానే గుండు సుదర్శన్ మూవ్ లేదు.. బర్నల్ ఉంది ఇవ్వమంటారా? అన్నప్పుడు వెన్నెల కిషోర్ పాత్రతో 'బబర్థస్త్' అంటూ, మరో ఇలాంటి పేలని పంచ్‌నే వేసి ఎక్స్‌ట్రా జబర్థస్త్ అంటూ పంచ్‌లు వేశారు.. నిజం చెప్పాలంటే ఈ సినిమాలో కామెడీ కంటే బబర్థస్త్ కామెడీ చాలా బాగుంటుంది అనే కామెంట్స్ సినిమా థియేటర్ నుంచి బయటికొచ్చే ఆడియన్స్ నుంచి వినిపించింది. ఓవరాల్‌గా జెట్‌లీ అవుట్‌డేటెడ్ కామెడీతో అందర్ని పూర్తిస్థాయిలో నిరాశపరిచింది.
సత్య కామెడీ తన స్టయిల్‌లో కనిపించినా, తెరపై ఆ వినోదం వర్కవుట్ కాలేదు. కొన్ని కొన్ని సింగిల్ లైనర్స్ పంచ్‌లు మినహా సత్య మార్క్ ఈసినిమాలో కనిపించలేదు. వెన్నెల కిషోర్ ఇలాంటి పాత్రలకు దూరంగా ఉంటే బెటర్ అనిపించింది. ఎవరి పాత్రలను దర్శకుడు సరైన రీతిలో డిజైన్ చేయకపోవడంతో ఏ పాత్రకు సరైన నటనకు స్కోప్ లేదు. కాలభైరవ సంగీతం, ఛాయాగ్రహణం ఈ సినిమాకు ఉన్న ప్లస్ పాయింట్స్.
బలహీనమైన కథతో, పేలవమైన కామెడీతో.. ప్రతి సీన్ ఆడియన్స్ ఓపికకు పరీక్షలా ఉన్న జెట్‌లీ చిత్రం ప్రేక్షకులను అలరించడంలో పూర్తిగా విఫలమైంది. బాక్సాఫీస్ వద్ద జెట్‌లీకి నిరాశ తప్పదు.

Movie Details
Movie Name: Jetlee
Release Date: 2026-05-01
Cast: Satya, Rhea Singha, Vennela Kishore, Ajay
Director: Ritesh Rana
Producer: Chiranjeevi,Cherry, Hemalatha Pedamallu
Music: Kaala Bhairava
Banner: Clap Entertainment
Review By: Maduri Madhu
Trailer